CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడమే లక్ష్యమంటున్నారు వైసీపీ అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అంటున్నారు.. ఆ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. అందుకు తగ్గట్టే వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ నెగ్గే తీరాలి అనే ప్లాన్ రెడీ చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ (TDP) నెగ్గిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. వరుస రివ్యూలు చేస్తున్నారు. మొదట కుప్పం.. తరువాత అద్దంకి.. ఆ తరువాత టెక్కలి.. ఇప్పుడు మండపేట.. ఇలా టీడీపీ నెగ్గిన నియోజకవర్గాల కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అక్కడ గెలుపు ఎందుకు సాధ్యం కాదు అని.. స్థానిక నేతలకు ధైర్యం చెబుతున్నారు.
గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశా అని.. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు అని ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మండపేట ప్రజలకు ఇప్పటి వరకు 946 కోట్ల రూపాయలను డీబిటీ ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చగలిగాం అన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశామన్నారు. మండపేట నియోజకవర్గంలో మొత్తం 96,469 ఇళ్లు ఉంటే.. అందులో 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి అన్నారు. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాం అన్నారు. ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశామని.. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. మరి ఎందుకు 175 సీట్లు గెలం అని ప్రశ్నించారు.
ప్రస్తుతం ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అన్నారు. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేస్తామనే నమ్మకం కలిగింది అన్నారు. నియోజకవర్గంలోని నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు పక్యా అనే ధైర్యం నింపారు. మీ అందర్నీ కలిసి.. గెలుపు దిశగా మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఇక్కడికి రమ్మన్నాను అన్నారు. మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవద్దన్నారు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలి అని స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కేవలం ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2 వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Ycp