హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jaga: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. పరిహారం కుదరదంటే రాష్ట్రమే ఇస్తుంది

CM Jaga: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం.. పరిహారం కుదరదంటే రాష్ట్రమే ఇస్తుంది

నేడు కొనసాగనున్న సీఎం జగన్ టూర్

నేడు కొనసాగనున్న సీఎం జగన్ టూర్

CM Jaga: ఇప్పటి వరకు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనని సీఎం జగన్.. తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పోలవరం విషయంలో కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్ని.. ఇంకా చేస్తూనే ఉంటామన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వనని చెబితే.. రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని.. అలాగే విలీన మండలాలను డివిజన్ గా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  CM Jaga: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) - కేంద్ర ప్రభుత్వం (Central Government) మధ్య సన్నిహిత సంబంధమే ఉంది. కేంద్రం నిధుల విషయంలో తాత్సారం చేస్తున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddy) మాత్రం.. ప్రతి విషయంలో కేంద్రానికి అండగానే నిలుస్తున్నారు. ఇటివల ఎన్డీఏ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ( Droupadi Murmu ) విజయం సాధించడంలోనూ జగన్ కీలక పాత్ర పోషించారు. ఇలా చాలా విషయాల్లో కేంద్రం మద్దతు అడగకపోయినా సహకరిస్తూనే వస్తున్నారు. అందుకుతగ్గ వధంగా కేంద్రం నుంచి నిధులు మాత్రం రావడం లేదు. జగన్ ఎన్నిసార్లు మొర పెట్టుకున్న మొండిచేయి మాత్రమే ఎదురవుతోంది. అయితే ఆయన ఇప్పటి వరకు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాడ్లాడలేదు. కానీ తొలిసారి కేంద్రం తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..

  పోలవరం నిధుల విషయంలో కేంద్రంతో యుద్ధమే చేస్తున్నామన్నారు.. ఆ యుద్ధం కొనసాగుతోంది అన్నారు. పోలవరం విలీన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. రాష్ట్రప్రభుత్వమే ఇస్తుంది అన్నారు. అంతేకాదు ఈ గ్రామాలకు పరిహారం ఇచ్చిన తరువాత.. పోలవరం ప్రాజెక్టులోకి నీరు వస్తుంది అని స్పష్టం చేశారు. 

  ప్రస్తుతం అల్లూరి జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. నేరుగా వరద బాధితులతో ఆయన మాట్లాడి.. వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఎవరూ భయపడొద్దని.. తాను ఉన్నాను అనే భరో కల్పిస్తున్నారు. చింతూరు మండలం కొయుగురు గ్రామంలో వరద బాధితులతో సీఎం జగన్‌ ముఖాముఖి మాట్లారు.

  ఇదీ చదవండి : ఎంతో ఇష్టపడి ఖరీదైన బైక్ కొనుక్కున్నారా.. కానీ పార్కింగ్ చేసేటప్పుడు బీకేఆర్ ఫుల్..

  రెండో రోజు పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి 20 వేల కోట్లు అవసరం అన్నారు. ఆ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామన్నారు. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే రాష్ట్రమే ఇచ్చేవాళ్లమన్నారు. అంత కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే.

  ఇదీ చదవండి : ప్రభుత్వ ఆఫీసర్ అంటే ఈమె.. కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన నవ్య

  పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనది అన్నారు. ఈ పర్యటన ముగిసిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి సీఎం జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, East godavari, West Godavari

  ఉత్తమ కథలు