హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆపేదే లేదు.. రాజకీయ టర్న్ తీసుకుంటున్న వివాదం

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆపేదే లేదు.. రాజకీయ టర్న్ తీసుకుంటున్న వివాదం

ఐదుగ్రామాల వివాదంపై రాజకీయ రంగు

ఐదుగ్రామాల వివాదంపై రాజకీయ రంగు

AP Villages: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య మొదలైన పంచయతీ ఇప్పట్లో ముగిసేలా లేదు.. ఇప్పటికే ఓ వైపు పోలవరం వివాదం రెండు ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమైంది. ఇప్పుడు విలీన గ్రామాల ప్రజలు సైతం.. తమను తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు.. మరి దీనిపై రెండు ప్రభుత్వాలు ఎలా నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

ఇంకా చదవండి ...

  AP Villages: ఇటీవల ముంచెత్తిన వరదలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) మధ్య కొత్త పంచాయితీకి కారణమయ్యాయి. మొన్నటి వరకు సఖ్యంగా ఉన్న తెలుగు రాష్ట్రల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) లపై టీఆర్ఎస్ (TRS), వైసీపీ (YCP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కేంద్రం దగ్గరే పంచాయితీ తేల్చుకునేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు విలీన గ్రామాల ఉద్యమం ఇప్పుడు మరో రచ్చకు కారణమవుతోంది. తమ గ్రామాల్ని తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆపేది లేదని అప్పటివరకు ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటామని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు విలీన గ్రామాల ప్రజలు. గత కొద్ది రోజులుగా ఏపీలోని ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తునే ఉన్నారు. భద్రాచలం (Badrachalam) వేదికగా నిన్న, ఈ రోజు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో ఐదు పంచాయతీలకు చెందిన ప్రజలు ఆందోళన నిర్వహించారు. నిరసనలను కొనసాగిస్తూనే ఉన్నారు.

  తమ గ్రామాల్ని తెలంగాణలో కలిపే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే పోరాటిన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. భద్రాచలంలో గత 15 రోజులుగా, సుమారు 40 అడుగుల మేర గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో గోదావరి వరద ఎప్పుడు తమ ఊళ్లమీద పడుతుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఐదు గ్రామ పంచాయతీల్లో ఒకటైన యటపాకలో కరకట్ట పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది.

  ప్రస్తుతం ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. కానీ రాను రాను ఇది రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం కనిపిస్తోంది. అన్ని పార్టీలకు చెందిన నేతలు, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యమానికి తెలంగాణకు చెందిన అఖిలపక్ష నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమంలో టీఆర్ఎస్ నేతలు కూడా భాగమైతే.. ఏపీ ప్రభుత్వంపై ఒత్లిడి మరింత పెరుగుతుంది.

  ఇదీ చదవండి : ఆ నాలుగు జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహరచన

  తమకు ఏదైనా అవసరం వస్తే చాలా దూరంలో ఉన్న పాడేరు వెళ్లాల్సి వస్తోందని అక్కడి ప్రజలు అంటున్నారు. తమ గ్రామాలకు అర కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే భద్రాచలం ఉందని, అందువల్ల తమను తెలంగాణలో కలిపితే సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు కూడా వచ్చి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే తమ గ్రామాల్ని తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.

  ఇదీ చదవండి : ఫ్యాక్షన్ అడ్డాలో బాలయ్య సందడి.. శరవేగంగా NBK107 షూటింగ్.. ఫోటోల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

  మరోవైపు ఈ సమస్యకు ఏపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవటం వల్లే ఇలా జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు. నమ్మకం కోల్పోవడంతో తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదల నాటినుంచి 14రోజులుగా కరెంటు, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Telangana border, Telangana

  ఉత్తమ కథలు