కొత్త అల్లుడుకు కాస్త క్రేజ్ ఉంటుంది. అందులో సంక్రాతి రాగానే.. కొత్త అల్లుడుకి అత్తగారింట్లో రాచమర్యాదలు మామూలుగా ఉండవు. అల్లుడు రాగానే.. వారికి చేసే అతిథి మర్యాదలు అద్బుతంగా ఉంటాయి. పండగకు అల్లుడు వస్తే ఆ ఇంట సంబరాలు... సరదాలు భలే ఉంటాయి. పండగలో కొత్త అల్లుళ్లదే హవా అని చెప్పాలి. నాటు కోళ్లు కోసి.. చిల్లు గారెలు చూసి వారికి విందు ఏర్పాటు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ కొత్త అల్లుడుకు కళ్లు చెదిరే రేంజ్‌లో ఏకంగా వందల రకాల వంటకాల్ని సిద్దం చేశారు అత్తింటివారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుడికి ఏకంగా 200 రకాల వంటలు రుచి చూపించారు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కుటుంబ సభ్యులకు, కొత్త అల్లుళ్ళకు రకరకాల రుచులు చూపించడం సంప్రదాయమే. ఈ క్రమంలోనే.. గ్రామానికి చెందిన అనంతపల్లి ఫణి, ఝాన్సీల కుమార్తెను భీమవరంకు చెందిన వొబిలిశెట్టి వినయ్ రాజ్ కుమార్‌తో గత ఏడాది ఘనంగా పెళ్లి జరిపించారు.
అయితే కొత్త ఏడాది అందులో సంక్రాంతి పండుగ రావడంతో అత్తవారింటికి వచ్చిన రాజ్ కుమార్‌కు కోసం భారీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అల్లుడే షాక్ అయ్యేలా.. పలు రకాల స్వీట్లు, కాజు స్వీట్లు, డ్రింక్, కోక్స్, చాకోలేట్ ఐస్ క్రీమ్స్‌తో పాటు సంప్రదాయ వంటకాలు 200 రకాలు రుచిచూపించారు.
దీంతో ఆ వంటకాల్ని చూసిన అల్లుడు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఇప్పుడు ఈ వార్త గోదావరి జిల్లాలతో పాటు... తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతోంది. నెట్టింట ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, West Godavari