ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్...వీక్లీ ఆఫ్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...

ఇకపై పోలీసులకు వారాంతపు సెలవులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇఫ్పటికే విశాఖపట్నంలో మొదలైన వీక్లీ ఆఫ్ విధానం ఇకపై ఏపీ మొత్తం అమల్లోకి రానుంది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఈ నెల 3న ఆదేశించారు.

news18-telugu
Updated: June 18, 2019, 4:21 PM IST
ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్...వీక్లీ ఆఫ్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ పోలీసులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై పోలీసులకు వారాంతపు సెలవులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రవిశంకర్ అయ్యనార్  కమిటీ సిఫార్సులపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు డిపార్ట్ మెంట్లో వీక్లీ ఆఫ్ విధానం అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో మొదలైన వీక్లీ ఆఫ్ విధానం ఇకపై ఏపీ మొత్తం అమల్లోకి వచ్చింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఈ నెల 3న ఆదేశించారు. అయితే దీనిపై అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో కమిటీ వేయగా, దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా కమిటీ నివేదిక ఈ నెల 12న డీజీపీ కార్యాలయానికి చేరింది. అయితే కమిటీ నివేదికలో పోలీసులోకి వివిధ విభాగాలకు చెందిన వారికి వారి ప్రాధాన్యతలను బట్టి వీక్లీ ఆఫ్ ను కేటాయించనున్నారు.

andhra pradesh,ap police,ap police department,andhra pradesh police recruitment,andhra pradesh police recruitment 2018,andhra pradesh police,andhra pradesh police vacancy 2019,andhra pradesh police network hacked,andhra pradesh hostel department recruitment 2018,andhra pradesh police jobs 2018,andhra pradesh police notification 2019,2018 andhra pradesh police jobs age restrictions
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో సమావేశం..


ముఖ్యంగా పోలీసులు బందోబస్తులు, వారెంట్స్, జనరల్ డ్యూటీ విభాగాల్లో పనిచేస్తున్న వారి విధులకు ఆటంకం కలుగకుండా ఒక రోజు వీక్లీ ఆఫ్ అమలు చేయనున్నారు. అలాగే ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలోనూ, సెక్యూరిటీ విధులు నిర్వహించే సిబ్బంది విషయంలోనూ పరిస్థితులకు అనుగుణంగా వీక్లీ ఆఫ్ ఇవ్వనున్నారు. అలాగే ట్రాఫిక్ విభాగంలో కూడా వీక్లీ ఆఫ్ సీనియారిటీ ప్రకారం ఇవ్వనున్నారు. అయితే అత్యవసర సమయాల్లో వీక్లీ ఆఫ్ రద్దు చేసుకొని డ్యూటీలో చేరేలా ఒప్పంద పత్రం రాసివ్వాల్సిన అవసరం ఉంది.

అలాగే  రవిశంకర్ అయ్యనార్ కమిటీ సిఫార్సుల రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. పోలీసు డిపార్ట్ మెంట్లో 20 శాతం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే  రాష్ట్రవ్యాప్తంగా పోలీసు విభాగంలో 12300 ఖాళీ ఉన్నట్లు, దీనిపై కమిటి రిపోర్ట్ పేర్కొన్నట్లు సవాంగ్ తెలిపారు.. దీంతో పాటు  వీఐపీ, యాంటి నక్సల్ డ్యూటి కోసం ఇబ్బంది రాకుండా వీలైనంత త్వరగా ఖాళీలు భర్తి చేస్తా.. అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటామని అన్నారు. అలాగే పోలీసులు ఒత్తిడి వల్ల స్ట్రోక్స్ , కిడ్ని , షుగర్ వ్యాదులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  రిటైర్ అయిన పదిపదిహేళ్లలోనే పోలీసులు చనిపోతున్నారని తెలిపారు. అవసరమైతే వీఆర్ లో ఉన్నవాళ్లని, పనిష్మెంట్లు తీసుకున్న వారిని కూడా తీసుకుంటామని తెలిపారు.
First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading