AP Weather Alert: మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని...ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక

AP Weather Alert: మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని...ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక

ప్రతీకాత్మకచిత్రం

కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. మత్స్య కారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాదని సూచించారు.

  • Share this:
    భార్త వాతావరణ శాఖ (ఐఎండి) సూచనల ప్రకారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈశాన్య బంగాళాఖాతంలో రాగల రెండు రోజల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు , పిడుగులు పడే అవకాశం ఉంది. కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. మత్స్య కారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాదని సూచించారు.

    రాగల 3 రోజుల పాటు వాతావరణ వివరాలు:
    సెప్టెంబర్ 19వ తేది : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

    సెప్టెంబర్ 20వ తేది: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తురు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

    సెప్టెంబర్ 21వ తేది: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తురువర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది
    Published by:Krishna Adithya
    First published: