హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు..

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weather Update: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

  రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ జార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.

  ఇక ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వివరించింది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంద. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Telangana, WEATHER

  ఉత్తమ కథలు