Weather Update: తెలంగాణ, ఏపీకి వర్ష సూచన.. పలుచోట్ల భారీ వర్షాలు

రాబోయే 2 రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

news18-telugu
Updated: July 2, 2020, 3:14 PM IST
Weather Update: తెలంగాణ, ఏపీకి వర్ష సూచన.. పలుచోట్ల భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది తెలిపింది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణకోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :
ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ వెథర్ రిపోర్ట్అటు ఒడిశా తీరం ప్రాంతంలో 3.6కి.మీ. నుంచి  5.8 కి.మీ ఎత్తున ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించిది. ఈ నేపథ్యంలో రాబోయే 5 రోజుల్లో తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో ఒకటి రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

First published: July 2, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading