హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Weather Update: ఏపీలో 5 రోజుల పాటు వానలు

AP Weather Update: ఏపీలో 5 రోజుల పాటు వానలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ఉత్తరాంధ్ర, యానం, దక్షిణాంధ్ర, రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే జోరుగా వానలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఐతే రాబోయే ఐదు రోజుల్లో ఏపీకి వానలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ఉత్తరాంధ్ర, యానం, దక్షిణాంధ్ర, రాయలసీమలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

  ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

  ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వానలు చాలా చోట్ల పడవచ్చు.

  దక్షిణ కోస్తా ఆంధ్ర :


  ఈరోజు,రేపు, ఎల్లుండి దక్షిణకోస్తాంధ్రలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.


  రాయలసీమ :

  ఈ రోజు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల పడవచ్చు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురవచ్చని వాతావరణశాఖ తెలిపింది. జూన్ 22, 23 తేదీల్లోనూ ఇదే పరిస్థితి కొనసావచ్చని వెల్లడించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, South West Monsoon, WEATHER

  ఉత్తమ కథలు