Heavy Rains in Andhra Prades and Telangana: వానలే వానలు.. వర్షాకాలం వెళ్లినా వానలు వదలడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన (Hevay Rains)ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక (srilanka) దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం కొనసాగుతోంది. 3 రోజుల పాటు తెలంగాణ (Telangana)లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనూ రానున్న 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఏపీలో రెండు జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుండడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్ష బీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు (Nellore) టౌన్ లోకి నీళ్లు చేరడంతో..ఇళ్లలోకి భారీగా నీరు చేరిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, వస్తువులు తడిసిపోవడంతో.. ప్రజలు అవస్థలు పడ్డారు. సమాచారం తెలుసుకున్న మంత్రి అనీల్ కుమార్.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రహదారులపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోవడంతో..వాహనాలు నిలిచిపోయాయి. నీళ్లు నిలవకుండా…అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నీట మునిగిన నెల్లూరు :
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా..సరాసరి…24.01 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాపోరు మండలంలో 78.2 మిల్లీమీటర్లు, కనిగిరిలో 70.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నెల్లూరు వాసులు బిక్కు బిక్కు మంటున్నారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులందరూ ఈనెల 13 వరకు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
తిరుపతిలో వర్ష బీభత్సం :
తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం చేస్తున్నాయి. నగరంలోని ప్రతి జంక్షన్ చిన్నపాటి చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి వర్షం కురుస్తోంది. వాహనాలను నీట మునిగిపోయాయి. తిరుమలకు వెళ్లే దారిలో నీట నిలవడంతో..శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీపురం సర్కిల్ లో కాల్వలు పొంగి ప్రవహిస్తుండడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
ఇదీ చదవండి: కార్తీక మాసం స్పెషల్.. పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు.. అందుబాటులో ధరలు
భారీ వర్షానికి నవ వధువు మృత్యువాత పడిందని తెలుస్తోంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ… 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Nellore, Rains, Telangana, Tirupati, Weather report