హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Weather Today: రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు...

Weather Today: రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి.

  రానున్న 24 గంటల్లో ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాయలసీమలో 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఈశాన్య మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిన తరువాతే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. అలాగే, ఈశాన్య మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో బుధవారం ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రుద్రసముద్రంలో 90, దొనకొండలో 86, తెనాలి, కరకంబాడిలో 70, రేణిగుంట 68.5, కనిగిరి, ఆత్మకూరు, సత్తెనపల్లిల్లో 60, రాపూరు 55, చింతపల్లి 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

  అయితే, దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తిరుపతిలో 39.6, నెల్లూరు 38.9, అనంతపురం 38.4, గుంటూరు 38.7, విజయవాడ 38.2, ఏలూరు 36.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh, AP News, Heavy Rains, Telangana, Telangana News, WEATHER

  ఉత్తమ కథలు