హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rain Alert: తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన...రాగల మూడురోజుల్లో వరుణుడి జోరు...

Rain Alert: తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన...రాగల మూడురోజుల్లో వరుణుడి జోరు...

ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉండగా, భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణ, రాయల సీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉంది.

తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరఠ్వాడ నుండి ఉత్తర తమిళనాడు వరకు మధ్య కర్ణాటక మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం –ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి మరియు నల్గొండ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

ఇక ఏఫీలో కూడా రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణకోస్తా ఆంధ్రాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

First published:

Tags: Monsoon rains

ఉత్తమ కథలు