Home /News /andhra-pradesh /

WEATHER REPORT TODAY IN ANDHRAPRADESH HEAVY RAINS IN COMING THREE DAYS SEP 18 MK

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 0.9 km ఎత్తు వరకు కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ shear zone 16°N Latitude వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

    ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km నుండి 3.6 km ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తూర్పు-పశ్చిమ shear zone తో విలీనం అయినది.

    ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒరిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

    ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 7.6 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

    ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

    ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

    ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
    ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    దక్షిణ కోస్తా ఆంధ్ర :
    ఈరోజు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
    రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
    ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    రాయలసీమ :
    ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
    రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Andhra Pradesh, AP News, WEATHER

    తదుపరి వార్తలు