AP Weather: ఏపీకి మళ్లీ వరుణ గండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Rains in Andhra Pradesh: ఏపీలోని అనేక జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

news18-telugu
Updated: September 19, 2020, 5:40 PM IST
AP Weather: ఏపీకి మళ్లీ వరుణ గండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అన్నారు. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు ఉత్తర కోస్తాలోని విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ వర్షాలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

దక్షిణకోస్తా ఆంధ్రాలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా ఈ జిల్లాల్లో వాతావరణం ఇదే రకంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఈ రోజు రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కర్నూలు, కడప జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరో రెండు రోజుల పాటు వాతావరణం ఇదే రకంగా ఉండొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది.
Published by: Kishore Akkaladevi
First published: September 19, 2020, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading