Heavy rains: తెలుగు రాష్ట్రాల (Telugu States)ను వర్షాలు ముంచెత్తుతున్నాయి (Heavy Rains). ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఇక పశ్చిమ బెంగాల్ (West Bengal) పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని తెలిపారు వాతావరణశాఖాధికారులు. దక్షిణ గంగేటిక్ పశ్చిమ బంగాల్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉపరితల ద్రోణి, అల్పపీడనం నుంచి తెలంగాణ వరకు కొనసాగుతుంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. రానున్న 48 గంటల్లో హైదరాబాద్ (Hyderabad) , ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలుగు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది చదవండి: లోబో అసభ్యంగా తాకాడు.. డ్రెస్ మార్చుకున్న కంటెస్టెంట్.. రవి ప్లేట్ ఫిరాయింపు..?
అల్పపీడన ప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో బుధవారం అక్కడక్కడ భారీగా, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ఇది చదవండి: మనదేశంలో చిన్నారులకు త్వరలో కొవాగ్జిన్.. గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్
గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా టెక్మాల్ 13 సెం.మీ , తాండూరు 10 సెం.మీ , హైదరాబాద్ 9.1 సెం.మీ సిరిపూర్ 8 సెం.మీ నమోదైంది. . మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా దోమలపల్లి(నల్గొండ జిల్లా)లో 4.9, నల్గొండలో 4.8, కోహెడ(సిద్దిపేట)లో 4.3, రావినూతల(ఖమ్మం)లో 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంతకుముందు సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా చిట్కుల్ (మెదక్)లో 14.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో అన్ని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు కళకళలాడుతోంది. అలాగే నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతతోంది. వర్షాకాలం ముగింపు దశలోనూ వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్టులు నిండుగా కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Weather report