Rain Effect: తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి.. గత మూడు రోజుల నుంచి విరామం లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? ఆరోగ్యకరమైన ఈ ఆరింటిని ఆహారంలో చేర్చండి
మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది.
నైరుతి సీజన్లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి:మనిషిలా మిమిక్రీ చేసే పక్షిని ఎప్పుడైనా చూశారా..? కావాలంటే ఈ వీడియో చూడండి!
ఏపీలోనూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీవర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇదీ చదవండి: కేవలం 1600లకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. పార్శిల్ ఓపెన్ చేస్తే షాక్
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో కురిసిన వర్షాలకు ఆకూరు- బడిగుంట గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతికి గల్లంతై ముగ్గురు మృత్యువాత పడ్డారు. వాగు దాటే యత్నం చేసినవారిలో 30 ఏళ్ల వెట్టి జ్యోతితో పాటు ఐదేళ్ల వయస్సున్న వెట్టి వంశీ దొర, పొడియం గణేష్ దొర ..జారి పడిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Hyderabad, Rains, Telangana, Weather report