హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు... తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు... తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు... తెలంగాణకు అతి భారీ వర్ష సూచన (credit - twitter)

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు... తెలంగాణకు అతి భారీ వర్ష సూచన (credit - twitter)

Rain Alert in Telugu States: ఇప్పటికే 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని భారీ వర్షాలు కురవడం ఖాయమంటున్నారు వాతావరణ అధికారులు.

  Rain Alert in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పూర్వ అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేడు, రేపు... భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల వలన వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచే అవకాశం ఉంది. చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్, పడిపోవడం వలన సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వలన లోతట్టు ప్రాంతాలలో, చిన్న బ్రిడ్జిలు, కాజ్‌వేలలో నీరు ప్రవహించే అవకాశం ఉంది. ట్రాఫిక్ అంతరాయలతో ప్రజలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాల యంత్రంగం మొత్తం అప్రమత్తంగా ఉండి ఇంతకు ముందు జారీ చేసిన వరద ప్రోటోకాల్ తప్పని సరిగా ఫాలో కావాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలంగాణ ప్రభుత్వ సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

  ఐఎండీ హైదరాాబాద్ కేంద్రం విడుదల చేసిన తాజా ప్రకటన

  Rain Alert in Andhra Pradesh:

  ఆంధ్రప్రదేశ్‌లో కూడా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.

  దక్షిణ కోస్తా ఆంధ్ర :

  నేడు దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

  రాయలసీమ :

  నేడు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

  వానాకాలంలో వర్షాలు పడటం కామనే. కానీ... ఎందుకు ఇంతలా వర్షాలు పడుతున్నాయి? అనే డౌట్ మనకు రావచ్చు. ఇందుకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణపై ఆవరించి ఉన్న ద్రోణి, వీటికి తోడు రుతుపవనాలు... కలిసి భారీ వర్షాలు పడుతున్నాయి. ఐతే... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఉన్నవి సాధారణ మేఘాలు కావు. అవి క్యుములో నింబస్ మేఘాలు. ఇవి పుట్టగొడుగుల్లా విడివిడిగా ఉంటాయి. ఒక్కో మేఘమూ చాలా దట్టంగా ఉంటుంది. దేనికదే వర్షం కురిపిస్తుంది. అందువల్ల ఓచోట భారీ వర్షం పడితే... మరోచోట సాధారణ వర్షం పడుతూ ఉంటుంది. ఈ మేఘాలు ప్రమాదకరమైనవి. వీటి వల్ల ఉరుములు, మెరుపులు, పిడుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: AP News, Rain alert, Telangana News

  ఉత్తమ కథలు