తెలుగు రాష్ట్రాల వైపు నైరుతీ ఆగమనం... ఏపీకి మూడు రోజులు వర్ష సూచన...

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

కేరళకు నైరుతీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలను... మరో రెండ్రోజుల్లో నైరుతీ పలకరించనుంది. ఇప్పటికే... రాయలసీమను పవనాలు టచ్ చేశాయి.

  • Share this:
    సోమ, మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపుల అలజడి కూడా ఉంటుందన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఏపీలో విపరీతమైన ఎండలే ఉన్నాయి. ఎక్కడనా నాలుగు జల్లులు పడినా... భూమి కూడా తడవట్లేదు. రాయలసీమలో కొద్దిపాటి వానలు కురుస్తాయని తెలిపారు. జూన్ 1న కేరళను తాకిన రుతుపవనాలు... అరేబియాలో తుఫాను కారణంగా... కొద్దిగా ఆలస్యమైనా... కర్ణాటక, తమిళనాడును టచ్ చేసి... తాజాగా ఏపీలోని రాయలసీమను చేరాయి. రెండ్రోజుల్లో ఇవి పూర్తిగా ఏపీని, ముడ్రోజుల్లో తెలంగాణలో విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇవి... మహారాష్ట్ర, సిక్కిం, మధ్యప్రదేశ్, ఒడిస్సా, బెంగాల్ వైపుగా పయనిస్తాయి. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉంది. అది ఇవాళ అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది.

    తెలంగాణలో ప్రస్తుతం ఉష్ణోగ్రతల వేడి కాస్త తగ్గింది. అయితే... వర్షాలు మాత్రం కురవట్లేదు. వాతావరణ అధికారులేమో కురుస్తాయని అంటున్నారు. లక్కేంటంటే... ఆదివారం మృగశిర కార్తె మొదలైంది. అందువల్ల ఎండల వేడి తగ్గనుంది. ఇక ఇక్కడి నుంచి భూమి క్రమంగా... సూర్యుడికి దూరంగా వెళ్తూ ఉంటుంది. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. అదే సమయంలో నైరుతీ రుతుపవనాలు దేశమంతా విస్తరించి వానలు కురిపించనున్నాయి. ఇప్పటికైతే రైతులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నట్లే అంటున్నారు అధికారులు. రైతుల పంటలకు ఎంత వాన కావాలో అంతే పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా జూన్ 10 తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: