అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం... ఏపీకి వర్ష సూచన... విస్తరిస్తున్న నైరుతి...

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈ రోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Weather : ఈపాటికే తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో ఉండాలి. కానీ నైరుతీ రుతుపవనాలు నెమ్మదించి... నిరాశ కలిగిస్తున్నాయి.

 • Share this:
  తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అనే మాట మనకు చాలా బాగా నచ్చుతుంది. కానీ... వాతావరణ అధికారులు చెప్పినట్లు మాత్రం వాతావరణం ఉండట్లేదు. ఇంకేముంది ఈ ఏడాది మంచి వానలు పడతాయి... అదిగో నైరుతి వచ్చేసిందని అన్నారు. నిజంగానే. జూన్ 1న కేరళకు నైరుతి వచ్చింది. జూన్ 10న తెలుగు రాష్ట్రాలకు... జూన్ 12న గుజరాత్, మహారాష్ట్రలకు కూడా నైరుతి పవనాలు వెళ్లాయి. అవి వెళ్లిన మొదటి రోజు మాత్రమే ప్రతి రాష్ట్రంలోనూ వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత నుంచి ఆకాశంలో నల్లటి మేఘాలే తప్ప... వర్షం మాత్రం పడట్లేదు. తాజాగా... ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇప్పుడు ఏపీ ప్రజలకు అదే వానను కురిపించేలా కనిపిస్తోంది.

  తెలంగాణలో రుతుపవనాల్లో చల్లదనం వస్తే... వానలు కురుస్తాయి. ఒకట్రెండు రోజులపాటూ... అక్కడక్కడా జల్లులు కురుస్తాయని అంటున్నారు. ఏపీకి సంబంధించి... ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందట. దానికి తోడు మధ్య భారతం మీదుగా తూర్పు, పడమరగా ద్రోణి ఏర్పడింది. దానివల్ల ఉత్తర కోస్తాలో కొద్దిగా జల్లులు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు పడతాయంటున్నారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు.

  నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దియు ద్వీపం అంతా విస్తరించాయి. గుజరాత్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీ్‌స్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. రెండు రోజుల్లో తూర్పు మధ్యప్రదేశ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తాయని చెబుతున్నారు. రుతుపవనాల్లో చల్లదనం తగ్గిపోవడం వల్ల వానలు పడట్లేదని అంటున్నారు. ఈసారి మంచి వానలు కురుస్తాయిలే అనుకున్న ప్రజలకు... నైరుతీ ప్రస్తుతానికి నిరాశ కలిగిస్తోంది.
  Published by:Krishna Kumar N
  First published: