WE HAVE TO INCREASE POPULATION GROWTH WOMAN SHOULD HAVE 4 KIDS SAYS CHANDRABABU INN DWCRA WOMENS MEETING AS
ముగ్గురు నలుగురు పిల్లలను కనండి...జనాభా పెరగాలి..చంద్రబాబు పిలుపు
చంద్రబాబు (ఫైల్ ఫొటో)
జనాభా పెరగకపోవడం మంచిది కాదని..మహిళలు ఇద్దరికి మించి పిల్లలను కనాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఒక్కొక్కరు నలుగురు పిల్లల్ని కన్నా పరవాలేదని అన్నారు.
జనాభా పెరుగుదలపై ఓ వైపు ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నో సమస్యలకు జనాభా పెరుగుదలే కారణమంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఇందుకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరగకపోవడం మంచిది కాదని..మహిళలు ఇద్దరికి మించి పిల్లలను కనాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఒక్కొక్కరు నలుగురు పిల్లల్ని కన్నా పరవాలేదని అన్నారు. అమరావతి సమీపంలోని నేలపాడులో నిర్వహించిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.
ఒకప్పుడు జనాభా నియంత్రణలో ఏపీ ముందంజలో ఉండేది. కానీ ఇప్పుడు జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని కనే విషయంలో నేటి యువత ఆసక్తి చూపకపోవడం సరికాదు. ఈ విషయంపై యువతలో చైతన్యం రావాలి. ఇద్దరికి మించి పిల్లల్ని కనాలి. చైనా, యూరప్, జపాన్లో జనాభా తగ్గుతోంది. జనాభా పెరగకపోవడం మంచిదికాదని తెలిపారు. ఒక్కొక్కరు నలుగురు పిల్లల్ని కన్న పర్వాలేదు. భారతీయ కుటుంబ వ్యవస్థ బలమైనది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను ఎత్తేస్తాం.
— చంద్రబాబు, ఏపీ సీఎం
కాగా, జనాభా పెరుగుదలపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జనాభా పెరగాలని కోరుకుంటోంటే...బాబా మాత్రం జనాభా తగ్గాలని సూచిస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కనేవారికి ఓటు హక్కును తొలగించాలని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు. అప్పుడే వందకోట్ల జనాభా ఉన్న భారత్లో జనాభా అదుపులోకి వస్తుందని స్పష్టంచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.