‘ఆటో డ్రైవర్లయిన మేము... ప్రమాణం చేస్తున్నాము...’

ట్రాఫిక్ సీఐ వినాయకరావు - పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కోడిగుడ్డు సత్రం వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

news18-telugu
Updated: August 22, 2019, 7:42 PM IST
‘ఆటో డ్రైవర్లయిన మేము... ప్రమాణం చేస్తున్నాము...’
గుంటూరులో ఆటోడ్రైవర్ల ప్రతిజ్ఞ
  • Share this:
గుంటూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకూ హెచ్చుతున్నాయి. అందుకు ఉన్న అనేకానేక కారణాల్లో ఆటోలు ప్రధానమైన అంశమనే చెప్పాలి. అడ్డదిడ్డంగా తోలడం... ఎక్కడ పడితే అక్కడ ఆపడం... పరిమితికి మించి ఎక్కించి - ప్రమాదాలతో చెలగాటమాడడం... ప్రయాణీకులు ఇతర వాహనదారులతో దురుసుగా వ్యవహరించడం... తదితర అవలక్షణాలతో (ఆటో డ్రైవర్లందరూ ఇలానే కాదు) నగరంలోని ఆటోలు చాలా చెడ్డ పేరునే మూటగట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో ట్రాఫిక్ సీఐ వినాయకరావు - పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కోడిగుడ్డు సత్రం వద్ద ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడిపితే చట్టపరమైన చర్యలు చేపడతానని చెప్పారు. అవసరమైతే ఆటోలు కూడా సీజ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆటోల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా... ట్రాఫిక్ సమస్యలు సృష్టించినా... పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించినా... సహించేది లేదని స్పష్టం చేశారు. ఈమేరకు ఆటో డ్రైవర్లతో ప్రమాణం చేయించారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు