ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటా: పవన్ కల్యాణ్

నేతలంతా కలిసి వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన‌ప‌రిచారని..వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్యమని స్పష్టంచేశారు. సంప్రదాయ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని.. దానికి జనసేన ఆలంబగా మిగలాలని ఆకాంక్షించారు.

news18-telugu
Updated: January 11, 2019, 6:11 PM IST
ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటా: పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్, జనసేన చీఫ్
news18-telugu
Updated: January 11, 2019, 6:11 PM IST
రాజకీయ వ్యవస్థలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అవినీతి లేకుండా పరిపాలిస్తారని 2014లో టీడీపీకి మద్దతిస్తే..తన అంచనాలకు మించి చంద్రబాబు సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు. దళితులను దెందలూరు ఎమ్మెల్యే వేధిస్తున్నాడని..ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ కులం పేరుతో ప్రజలను విడగొట్టదని..సమాజ వికాసం కోసమే తాము పనిచేస్తామని స్పష్టంచేశారు. పశ్చిమగోదావరి జిల్లా నేతలు, కార్యకర్తతో సమీక్షా సమావేశం నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు.

నా ఆలోచ‌న‌లు, అనుభ‌వాల నుంచి పుట్టిన‌వే జ‌న‌సేన పార్టీ ఏడు మూల సిద్ధాంతాలు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని అవ‌మానాల‌ను భ‌రించానో, ఎంత‌మందిని ప్ర‌భావితం చేశానో, ఎన్ని స‌మావేశాలు పెట్టానో మీ అంద‌రికి తెలుసు. పార్టీ సంస్థాగ‌త నిర్మాణానికి స‌మ‌యం అస‌న్న‌మైనందున పార్ల‌మెంట్ స్థాయిలో క‌మిటీలు వేయాల‌ని నిర్ణ‌యించాను. దీని కోస‌మే జిల్లా స‌మీక్ష స‌మావేశాలు ఏర్పాటు చేశాను. ప్ర‌జా సంక్షేమం కోసం నేను ఎవ‌రితో గొడ‌వ‌పెట్టుకోవ‌డానికైనా సిద్ధం. కులం, మ‌తం, ప్రాంతీయ‌త‌ను న‌మ్ముకుని నేను రాజ‌కీయాల్లోకి రాలేదు. మాన‌వ‌త్వం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను. విభ‌జించు పాలించు అనే సిద్ధాంతం ఏ రూపంలో ఉన్నా నేను వ్య‌తిరేకిస్తాను.
పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
రాజకీయ నేతలు మాట్లాడుతున్న మాటలు, యువత మాటలకు.. చాలా తేడా కనిపిస్తోందన్నారు పవన్. మూడు ద‌శాబ్దాలు ముఖ్యమంత్రి చేయండ‌ని ఒక‌రు, మరోసారి ముఖ్య‌మంత్రి చేయ‌డండని ఇంకొకరు, నా త‌ర్వాత మా అబ్బాయిని ముఖ్య‌మంత్రిని చేయండ‌ని మ‌రొక‌రు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. యువత మాత్రం తమకు 25 కిలోల బియ్యం అక్క‌ల్లేదని, 25 ఏళ్ల భ‌విష్య‌త్తు ఇవ్వండ‌ని అడుగతున్నారని చెప్పారు. నేతలంతా కలిసి వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన‌ప‌రిచారని..వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్యమని స్పష్టంచేశారు. సంప్రదాయ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని.. దానికి జనసేన ఆలంబగా మిగలాలని ఆకాంక్షించారు.
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...