శ్రీశైలం డ్యాంకు పగుళ్లు.. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు..

వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్

Srisailam Dam : శ్రీశైలం ఆనకట్టకు అడ్డుగా పగుళ్లు ఏర్పడ్డాయని వాటర్‌మ్యాన్ రాజేంద్ర సింగ్ చెప్పారు. పగుళ్లు మరింత ఎక్కువైతే తెలుగు రాష్ట్రాలకు ఊహించని నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

  • Share this:
    శ్రీశైలం డ్యాం ప్రమాదంలో ఉందా? డ్యాంకు పగుళ్లు ఏర్పడి తెగిపోయే అవకాశం ఉందా? అదే జరిగితే తెలుగు రాష్ట్రాలకు ఊహించని నష్టమేనా? అంటే అవునంటున్నారు వాటర్ మ్యాన్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్. డ్యాం కట్ట తెగిపోతే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నాగార్జున సాగర్ కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు. గంగాజల్ సాక్షరతా యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను, నదులను సందర్శిస్తున్న రాజేంద్ర సింగ్.. బుధవారం నాడు శ్రీశైలం డ్యాంను సందర్శించారు. ఈ సందర్భంగా డ్యాంను పరిశీలించగా.. ఆనకట్టకు అడ్డుగా పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. పగుళ్లు మరింత ఎక్కువైతే తెలుగు రాష్ట్రాలకు ఊహించని నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రభావానికి సగం ఏపీ మునిగిపోతుందని హెచ్చరించారు. జలాశయంలో ఓ భారీ గొయ్యి ఏర్పడుతోందని చెప్పారు. గతంలో నిర్మించిన డ్యాంలను, రిజర్వాయర్ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.

    అటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన రాజేంద్ర సింగ్ పలు అంశాలపై చర్చించారు. ఏపీలో తెలుగు భాష ప్రమాదంలో పడిందని, దేశవ్యాప్తంగా మాతృ భాషలు ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భాష పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
    First published: