హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Water War: తగ్గేదే లే అంటున్న తెలుగు రాష్ట్రాలు.. జటిలమైన నీటి యుద్ధం.. KRMBకి ఏపీ సర్కార్ లేఖ..

Water War: తగ్గేదే లే అంటున్న తెలుగు రాష్ట్రాలు.. జటిలమైన నీటి యుద్ధం.. KRMBకి ఏపీ సర్కార్ లేఖ..

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

కేసీఆర్, జగన్(ఫైల్ ఫోటోలు)

Andhra Pradesh Vs Telangana:తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మరింత ముదిరింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి కౌంటర్ లెటర్ రాసింది. అసలు ఎందుకు రెండు రాష్ట్రాలు వెనక్కు తగ్గడం లేదు.. ఇందులో ఎవరి వాదన నిజం.. అసలు ఈ వివాదాని ప్రధాన కారణం ఏంటి..?

ఇంకా చదవండి ...

    Krishna Water War: తెలుగు రాష్ట్రాలు  (Telugu states)తగ్గేదే లేదు అంటున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల జగడం (Water Dispute) మరింత ముదురుతోంది. తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సర్కార్‌పై ఫిర్యాదు చేసింది. శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిపై మరోసారి KRMBకి ఫిర్యాదు చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు ENC నారాయణరెడ్డి దీనిపై లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌లపై రెండు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని సూచించారు. బోర్డు అనుమతి లేకుండా, ఏపీ వైపు నుంచి ఇండెంట్‌ లేకుండా ఉత్పత్తి చేస్తోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ జెన్‌కో ఉత్పత్తి చేస్తోందన్నారు. వెంటనే విద్యుత్‌ ఉత్పత్తిని ఆపించాలని KRMBని కోరారు AP ENC నారాయణరెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది.  ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రెండూ రాష్ట్రాలు మరొకరి తీరును తప్పు పడుతూ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కేఆర్ఎంబీ (KRM), జీఆర్ఎంబీ (GRMB)కి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ ను కొనసాగిస్తున్నాయి. కేఆర్ఎంబీ (Krishna River Management Board), జీఆర్ఎంబీ (godavari river management board) కి వరుస లేఖలు రాస్తూ వాటర్ వార్ హీట్ ను పెంచుతున్నాయి. కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ రాసిన లేఖకు ఏపీ ప్రభుత్వం కౌంటరిచ్చింది.

    మరోవైపు, ఇప్పటికే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.

    ఇదీ చదవండి: పిల్లోడు కాదు చిచ్చర పిడుగు.. ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్ ఆఫీసుతో అద్భుతాలు.. అరుదైన రికార్డు సొంతం

    అసలు ఎందుకీ వివాదం..

    భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ప్రవహిస్తోన్న ఈ నది పొడవులో గంగ బ్రహ్మపుత్ర గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది. దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది మహారాష్ట్ర నుంచి కర్ణాటక అక్కడి నుంచి తెలంగాణ ఆ తరువాత ఆంధ్రాలోకి వస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి ఆ తరువాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. నదికి ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణానదిపై శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమవైపున తెలంగాణ ఉంది. వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

    ఇదీ చదవండి:ఏపీలో కరోనాను మించి భయపెడుతున్న మరో మహమ్మారి.. పెరుగుతున్న కేసులు

    2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండగా నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండగా నీటి వాటా 64 శాతం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి ముందు చెప్పుకున్నట్టు కృష్ణా డెల్టా తన హక్కు ఉపయోగించడం దిగువన ఉండడం వంటివి కారణాలు.. సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా పరోక్షంగా రాయలసీమకు మేలు. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంటాయి.

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, CM KCR, Telangana, Water dispute

    ఉత్తమ కథలు