హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag: కాలువలు తవ్వి పదేళ్లు అయ్యింది... చుక్క నీరు లేదు.. !

Vizag: కాలువలు తవ్వి పదేళ్లు అయ్యింది... చుక్క నీరు లేదు.. !

మడ్డువలస (ఫైల్ ఫోటో)

మడ్డువలస (ఫైల్ ఫోటో)

కాలువలను నిరుపయోగంగా వదిలేయడంతో ప్రస్తుతం పనికిరాని మొక్కలు, ముళ్లపొదలు, ఎక్కడికక్కడ గట్లు మరమ్మతులకు గురై దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం రైతులు నీరు లేక నీలగిరి, సరుగుడు తోటలు వేసుకుంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India

సాగునీటి కోసం కాలువలు తవ్వి పదేళ్లు గడిచాయి...చుక్క నీరు ఏ పంటకు రాలేదు... పలు పొలాల సమీపంలో పనికిరాని మొక్కలతో నిండిపోయిన కాలువే దర్శనం ఇస్తున్నాయి. వేలాది ఎకరాల పొలాలను ఆనుకునే కాలువలు ఉన్నా సాగునీరు రాని దుస్థితితో కాలువ ప్రస్తుత స్తితి.  ఇరిగేషన్‌, డి.ఆర్.సి మీటింగ్లలో ఇదిగో చేస్తాం... అదిగో చేస్తాం అంటూ ప్రకటనలకే అధికారులు పరిమితం అవుతున్నారే తప్ప రైతులను ఆదుకోవడం లేదని స్పష్టం అవుతోంది. ఇది ఏక్కడో కాదు.. శ్రీకాకుళం జిల్లా మడ్డువలస జలశాయ కాలువ పరిస్థితి.

జలాశయంలో సాగునీరున్నా సేద్యం చేయలేని పరిస్థితి. కాలువలు వస్తే పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మడ్డువలస ప్రాజెక్టు కింద లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు మండలాల పరిధిలో పరిస్థితి ఇది. లావేరు మండల పరిధిలోని కొత్త, పాతకుంకాం, గుర్రాలపాలెం, అదపాక, బుడుమూరు పంచాయతీలతో పాటు ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస, అల్లినగరం, పొందూరు మండలంలోని రాపాక తదితర ప్రాంతాలతో పాటు జి.సిగడాం మండలంలోని 12 పంచాయతీలకు మడ్డువలస ప్రాజెక్టు ద్వారా సాగు నీరందాల్సి ఉంది.

ఈ మండలాల పరిధిలో 22 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకాలు చేపట్టగా 12,500 ఎకరాలకు సాగు నీరందాల్సింది. కాలువ తవ్వకాలు పూర్తయినప్పటికీ చుక్కనీరు రాలేదని ఆయా గ్రామాలకు చెందిన రైతులు వాపోతున్నారు. పలుమార్లు ప్రాజెక్టు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు. అప్పట్లో జి.సిగడాం మండల పరిధిలోని దేవరవలస సమీపంలో కాలువకు అడ్డంగా పెద్ద బండరాయి ఉండటంతో దిగువ ప్రాంతానికి నీరు రావడం లేదని అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ రాయిని కొంతమేర తొలగించారు. ఈ ఏడాదైనా సాగునీరు వస్తుందాని ఎదురు చూస్తున్నారు.

కాలువలను నిరుపయోగంగా వదిలేయడంతో ప్రస్తుతం పనికిరాని మొక్కలు, ముళ్లపొదలు, ఎక్కడికక్కడ గట్లు మరమ్మతులకు గురై దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతం రైతులు నీరు లేక నీలగిరి, సరుగుడు తోటలు వేసుకుంటున్నారు. మడ్డువలస జలాశయం ద్వారా సాగునీరు వస్తుందని విలువైన భూములను తక్కువ ధరకు ఇచ్చారు రైతులు. కాలువ తవ్వకాలు చేపట్టడంతో ఎంతో సంతోషపడ్డారు. ఏళ్లు గడుస్తున్నా చుక్కనీరు రాని పరిస్థితి. ఏటా ఎదురుచూపులే మిగులుతున్నాయి.

అధికారులు పట్టించుకోవడం లేదుని, పొలాల్లో నుంచి కాలువ తవ్వకాలు చేపట్టి వదిలేశారని అంటున్నారు రైతులు. సాగునీరు విడుదల చేయడం మరిచారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాలువల్లో పనికిరాని మొక్కలు దట్టంగా పెరిగాయి. వచ్చే ఖరీఫ్‌ నాటికైనా సాగునీరు విడుదల చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది.

First published:

Tags: AP News, Local News, Srikakulam, Water Crisis

ఉత్తమ కథలు