విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్... ఎవరు చేస్తున్నారంటే...

AP Assembly Election 2019 : టీడీపీని తరచూ టార్గెట్ చేసేవాళ్లలో విజయ సాయి రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆయన్ను టార్గెట్ చేస్తున్నదెవరు...

Krishna Kumar N | news18-telugu
Updated: April 16, 2019, 8:44 PM IST
విజయసాయిరెడ్డికి బెదిరింపు కాల్స్... ఎవరు చేస్తున్నారంటే...
విజయసాయి రెడ్డి
  • Share this:
వైసీపీపై టీడీపీ సహా ఏ పార్టీ, ఏ ఆరోపణలు చేసినా... వాటిని గట్టిగా తిప్పికొట్టేవారిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఒకరు. అప్పుడప్పుడూ మీడియాలో విమర్శలు చేస్తూ, కౌంటర్లు ఇచ్చే ఆయన... సొంత ట్విట్టర్ అకౌంట్‌లో మాత్రం ప్రతి రోజూ ప్రత్యర్థుల్ని ఉతికారేస్తూ ఉంటారు. ఆయన వేసే సెటర్లు సోషల్ మీడియాలో పేలుతూ ఉంటాయి. అలాంటి విజయసాయి రెడ్డి... ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. సడెన్‌గా ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా 8247662578, 8886059309, 9618729089, 9538362525 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచనలతో తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

బెదిరింపు కాల్స్ ఎవరు చేస్తున్నారో కనిపెట్టడం ఇప్పుడు పోలీసుల వంతు. ఇదేమీ కష్టమైన పని కాదు. ఆల్రెడీ మొబైల్ నంబర్లు ఉన్నాయి కాబట్టి... ఆ నెంబర్లు కల సిమ్‌లను ఎవరు వాడుతున్నారో తెలుసుకోవడం ఈజీయే. ఐతే... ఆ సిమ్‌లను నకిలీ ఐడీలతో సంపాదించి ఉంటే మాత్రం కనిపెట్టడం పోలీసులకు కొంత టైం పడుతుంది. ఒకవేళ నకిలీ సిమ్‌లతో కాల్స్ చేస్తున్నట్లైతే... ఆ కేటుగాళ్లు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు సిమ్ ట్రాప్ సిస్టంను ఉపయోగిస్తారు. తద్వారా నేరస్థులు ఏయే టవర్ల నుంచీ కాల్స్ చేస్తున్నారో తెలుస్తుంది. తద్వారా ఆ ఏరియాలో నిఘా పెట్టి వాళ్లను పట్టుకునే అవకాశాలున్నాయి.


బెదిరింపు కాల్స్ చేస్తున్న వారికి కఠినమైన శిక్షలు పడే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఆధారాలు పక్కాగా ఉంటాయి. పైగా వాళ్లు బెదిరిస్తున్నది హైప్రొఫైల్ రాజకీయ నేత, ఎంపీని. అందువల్ల పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్య కేసుగా పరిగణించే అవకాశాలున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

పుదుచ్చేరిలో ఈసారి గెలిచేదెవరు... పుదుచ్చేరి లోక్ సభ స్థానం ఎందుకు ప్రత్యేకమైనది...

ముస్లింలంతా కాంగ్రెస్‌కి ఓటు వేయాలి... సిద్ధూ వ్యాఖ్యలపై చర్యలకు బీజేపీ డిమాండ్...దయచేసి అలాంటి వార్తలు ఇవ్వొద్దు... మీడియాకు తెలంగాణ సీఈసీ రజత్ కుమార్ వినతి

అంబటి రాయుడు త్రీడీ గ్లాసెస్ ట్వీట్... టీంఇండియా సెలెక్టర్లపై సెటైర్ వేసేశాడుగా...
First published: April 16, 2019, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading