హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వీవీప్యాట్ స్లిప్పులను ఇలా లెక్కించాలి... రూల్స్ ఏంటో చెప్పిన ఈసీ...

వీవీప్యాట్ స్లిప్పులను ఇలా లెక్కించాలి... రూల్స్ ఏంటో చెప్పిన ఈసీ...

ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు

ఈవీఎంలు, వీవీప్యాట్ మిషన్లు

Lok Sabha Election 2019 : వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్‌పై చర్చ జరుగుతోంది. వాటిని ఎలా లెక్కించాలో ఎన్నికల సంఘం క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది. లాటరీ ద్వారా వీవీప్యాట్ యంత్రాల్ని ఎంపిక చేయబోతోంది. జస్ట్ 2 గంటల్లో స్లిప్పుల కౌంటింగ్ అయిపోతుంది.

ఇంకా చదవండి ...

  Lok Sabha Elections 2019 : మే వచ్చేసినట్లే. ఇక మనం అందరం 23వ తేదీ కోసం మరింత ఆతృతగా ఎదురుచూసే సమయం. ఐతే మనందరికీ ఓ డౌట్ అలాగే ఉంది. ఏంటంటే... ఈ వీవీప్యాట్ స్లిప్పుల్ని ఎలా కౌంటింగ్ చేస్తారు. వాటిని కౌంటింగ్ చెయ్యడానికి ఎంత టైమ్ పడుతుంది. అసలా ప్రక్రియ ఎలా జరుగుతుంది. ఇలా ఎన్నో డౌట్లు. మనం ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా... కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. వీవీ ప్యాట్ స్లిప్పులు ఎలా కౌంట్ చెయ్యాలో చెప్పింది. ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 5 వీవీ ప్యాట్ మెషీన్లలోని స్లిప్పులను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లెక్కపెడతారు. లెక్కించే టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని పద్ధతులు అనుసరిస్తారు. వాటి గురించి ఉద్యోగులకు ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు.


  ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరుగా లాటరీ ద్వారా లెక్క పెట్టి, సరిచూడాల్సిన 5 వీవీప్యాట్ యంత్రాల్ని ముందుగా ఎంపిక చేస్తారు. అంతకంటే ముందు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈవీఎంలలోనూ పోలైన ఓట్ల లెక్క తేల్చేస్తారు. తర్వాత వీవీ ప్యాట్ యంత్రాల్ని టేబుల్‌పైకి తీసుకొస్తారు. ఈ టైంలో ఫారం 17సీ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎంత మంది ఓటర్లు ఉన్నారో, ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో వివరాలు ఉంటాయి. సో, ఆ ప్రకారం వీవీప్యాట్ స్లిప్పులు ఉన్నాయో లేదో సరిచూస్తారన్న మాట.


  వివిధ పార్టీల ఏజెంట్లు చూస్తుండగా... వాళ్ల ముందే వీవీ ప్యాట్ స్లిప్పులను బయటకు తీస్తారు. అభ్యర్థుల వారీగా వాటిని వేరు చేస్తారు. 25 చొప్పున కట్టలు కట్టి, అప్పుడు లెక్క పెడతారు. ఇదంతా పెద్ద ప్రక్రియలా మనకు అనిపిస్తుంది కానీ... ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఉండటం వల్ల... ఈసీ ఉద్యోగులు ఈ పనిని చకచకా చేస్తారు. అందుకే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 2 నుంచీ 3 గంటలు పడుతుంది.


  ఐదు వీవీ ప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కబెట్టాల్సి వుండటంతో, ఐదు వీవీప్యాట్‌లనూ ఒకేసారి తెరుస్తారు. ఈవీఎంలను లెక్కించే టేబుల్ పైనే ట్రేలను ఏర్పాటు చేసి వాటిలోనే స్లిప్పులను వేసి లెక్క పెడతారు. ఇదంతా సాయంత్రం నుంచీ రాత్రి సమయంలో జరిగే అవకాశాలున్నాయి.


  ఒక్కో లోక్ సభ సెగ్మెంట్‌లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి కాబట్టి, మొత్తం 35 వీవీ ప్యాట్ మెషీన్లలో స్లిప్పులను లెక్కించాల్సి వుంటుంది. రిటర్నింగ్ అధికారి దగ్గరున్నప్పుడు, వాళ్లు చూస్తున్నప్పుడే ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. ఇదంతా సజావుగా జరగాలి కదా... అందుకని ఓ 20 రోజుల పాటూ... సిబ్బందికి ఈసీ ఫుల్ ట్రైనింగ్ ఇవ్వబోతోంది. అంతా సవ్యంగా జరిగి... ఈవీఎంలలో ఓట్ల ప్రకారమే స్లిప్పులు కూడా ఉంటే... ఏ సమస్యా ఉండదు. ఏదే తేడా వస్తే మాత్రం రాజకీయ దుమారం రేగే ప్రమాదం ఉంటుంది. ఈసీ అధికారులు ఏ సమస్యా ఉండదని కచ్చితంగా చెబుతున్నా్రు. అలాగే జరగాలని మనమూ కోరుకుందాం.


   


  ఇవి కూడా చదవండి :


  మళ్లీ ఛార్జీల మోత... పెంచేందుకు రెడీ అవుతున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఏకంగా 17 శాతం...


  స్టూడెంట్స్ బీ రెడీ... మే రెండో వారంలో ఏపీ టెన్త్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్...


  టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...


  ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Election Commission of India, EVM, Evm tampering, Vvpat

  ఉత్తమ కథలు