హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vundavalli on KCR: కేసీఆర్‌ క్లారిటీతో ఉన్నారు.. నన్ను అలా చేయమన్నారు.. ఉండవల్లి వివరణ

Vundavalli on KCR: కేసీఆర్‌ క్లారిటీతో ఉన్నారు.. నన్ను అలా చేయమన్నారు.. ఉండవల్లి వివరణ

కేసీఆర్, ఉండవల్లి (పాత ఫొటోలు)

కేసీఆర్, ఉండవల్లి (పాత ఫొటోలు)

Vundavalli On KCR తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి రాణించే ఆలోచన, శక్తి తనకు లేదని కేసీఆర్‌కు చెప్పినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

  దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల చాలా నష్టం జరుతుందని కేసీఆర్ తనతో చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్‌తో జరిగిన తన సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి రాణించే ఆలోచన, శక్తి తనకు లేదని అన్నారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్‌కు కూడా చెప్పానని ఉండవల్లి (Undavalli Arun Kumar) స్పష్టం చేశారు. దేశంలోని పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌‌(Telangana CM KCR) తనకన్నా ఎక్కువ హోంవర్క్ చేస్తున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో కూటముల ద్వారా బీజేపీని(BJP) ఎదుర్కొనే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారని.. అందుకే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయంగా ఓ పార్టీని ఏర్పాటు చేయడంపై ఆయన చర్చలు జరుపుతున్నారని అన్నారు.

  బీజేపీ విధానాల వల్ల జరిగే నష్టాల గురించి తాను మాట్లాడుతున్నానని.. ఆ విధంగానే ముందుకు సాగాలని కేసీఆర్ తనకు చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాను బీజేపీ విధానాలను వ్యతిరేకించే ఎవరితోనైనా కలిసి పని చేస్తానని.. కేసీఆర్ అదే పనిలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మరోసారి తనను పిలుస్తానని చెప్పినట్టు చెప్పిన ఉండవల్లి అరుణ్ కుమార్.. టీఆర్ఎస్‌ను (TRS) బీఆర్ఎస్‌గా మార్చే అంశం తమ మధ్య ప్రస్తావనకు రాలేదని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఇదే రకంగా కొనసాగితే దేశానికి ప్రమాదమని.. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశాయని ఆయన గుర్తు చేశారు.

  కేసీఆర్‌తో జరిగిన సమావేశంలో ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే ఆయన తనతో పెద్దగా ఏమీ మాట్లాడలేదని ఉండవల్లి వివరించారు. కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీని ఏపీలో తాను లీడ్ చేయబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఉండవల్లి స్పష్టం చేశారు. దేశంలో బీజేపీి విధానాలను సమర్ధవంతంగా వ్యతిరేకించే నేతలు చాలామంది ఉన్నారని.. అయితే వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే నేతలు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారని అందులో కేసీఆర్ ఒకరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

  KCR| Andhra Pradesh: ఏపీలో కొత్త పంచాయతీ పెట్టనున్న కేసీఆర్ ?

  YSRCP Job Mela: ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 15 వేల మందికి జాబ్స్.. రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ ఇదే

  ఎవరూ వ్యతిరేకించలేని విధంగా బీజేపీ విధానాలు తప్పు అని నిరూపించే అనేక అంశాలను ఆధారాలతో సహా కేసీఆర్ సేకరిస్తున్నారని.. త్వరలోనే ఆయనే దీనిపై అన్ని విషయాలు చెబుతారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఇక ఏపీలో ఏ పార్టీ గెలిచినా.. అందరూ బీజేపీకి మద్దతు ఇచ్చే వారేనని వ్యాఖ్యానించారు. తమ మధ్య రాష్ట్రపతి ఎన్నికల అంశం ప్రస్తావనకు రాలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే విధానంతో కాకుండా విపక్షాలు లేని భారత్ అనే విధానంతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, CM KCR, Undavalli Arun Kumar

  ఉత్తమ కథలు