Kantara: ఆంధ్రప్రదేశ్ కు చెందిన తహసీల్దార్ (MRO).. కాంతారాగా మారారు.. ఎమ్మెర్వో కాంతారా ఏంటి అని షాక్ అవుతున్నారా..? కానీ నిజం.. ఈ విడియో చూస్తే.. అవును కాంతారానే వావ్ అంటారు.. ప్రస్తుతం కీలకమైన ప్రభుత్వ కొలువు (Government Job) లో ఉన్నా.. ఆయనకు కళలంటే పిచ్చి.. చిన్నప్పటి నుంచి నాటకాలు.. యాక్టింగ్ (Acting) అంటే మహా ఇష్టం.. ఆయనకు ఇష్టమైన రంగంవైపు వెళ్లకుండా.. ప్రభుత్వ కొలువులో చేరారు.. ఆయనకు కళలపై అభిమానం పోలేదు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా.. తనలో ఉన్న కళను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ఎప్పుడు వేషం (Getup) వేస్తే.. అప్పటికి ట్రెండింగ్ (Trending) లో ఉన్నది.. బాగా వైరల్ (Viral) అయిన వాటినే ఫాలో అవుతూ వస్తున్నారు. అలా కొత్త కొత్త వేషాలు వేస్తూ.. అక్కడున్నవారిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ప్రస్తుతం కొత్తవలస తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు డి. ప్రసాదరావు.. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ కన్నడ డబ్బింగ్ చిత్రం కాంతారాలో దైవ రూపంలో వేసిన డ్యాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.
గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పన్నుల శాఖ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో పలువురు అధికారులు పాల్గొన్నారు. మొన్న ‘కాంతార’ సినిమాలో తహసీల్దార్ ప్రసాదరావు గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అచ్చం రిషబ్ శెట్టి డ్యాన్స్ ను కూడా అలానే దింపాశారు.
MRO Turned Kantara|| కాంతారా నృత్యాన్ని దింపేసిన తహసీల్దార్ || వీడియో చూ... https://t.co/UnfiRAmejZ via @YouTube #KantaraMovie #Kantara #KantaraTelugu #KantaraKannada #RishabShetty #Vizianagaram
— nagesh paina (@PainaNagesh) November 22, 2022
ఆ వేదికపై కాంతార చిత్రంలోని వరాహ రూపం పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ నాట్యం చేసినందుకు అతడు మొదటి బహుమతి గెలుచుకున్నారు కూడా.. దీంతో అతడి ప్రదర్శనపై నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇక పలువురు జిల్లా కలెక్టర్లు కూడా అతడి నటన.. డ్యాన్స్ చూసి మంత్రముగ్ధులవుతూ.. ప్రశంసలు కురిపించారు.. అతనిలో ఉన్న ప్రతిభను మరింత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించారు. కేరళ ఆదివాసీల ఆచార సంప్రదాయలు.. తుళునాడు కథ అయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రేక్షకలను మెప్పించింది.
ఇదీ చదవండి : ఏపీలో బీజేపీకి అదే మైనస్సా.. పార్టీ బలపడకపోవడానికి కారణం ఎవరు..?
కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్గా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రా, తెలంగాణా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోనే క్లైమాక్స్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది అనడం అతి శయోక్తి కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kantara, Vizianagaram