Vasantha Panchami: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చదువల తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. రాష్ట్రంలో ఉన్న సరస్వతి దేవి (Sarswathi Devi) అమ్మవారి ఆలయాల్లో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తల్లిదండ్రులు తరలి వచ్చారు. భారీగా భక్తులు వస్తారని ఊహించిన నిర్వహాకులు కొన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. కొన్ని ఆలయాల్లో మాత్రం రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు. చాలా ఆలయాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు (Ticket Counters) ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజయ నగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మావారి ఆలయానికి తెల్లవారు నుంచే భక్తులు పోటెత్తారు.. అడుగు వేయడానికి కూడా వీళ్లేకుండా భక్తులు తరలి వచ్చారు. చిన్నారులంతా పలక, బలం చేత పట్టి అక్షరాభ్యాసాల్లో పాల్గొన్నారు. ఈ రోజు అమ్మవారి సన్నిధిలో ఓనమాలు దిద్దితే.. ఉన్నత విద్యావంతులుగా నిలుస్తారని భావించి.. ఈ రోజు ఆలయానికి అనూహ్యంగా భక్తులు పోటెత్తారు.
Vasantha Panchami 2023 || జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసాలు || వైభవం... https://t.co/Yw29NowUJA via @YouTube #VasanthaPanchami #vasanthamvanthachu2 #SarswatiPuja #sarswatipooja #sarsawatipuja #VizagIT
— nagesh paina (@PainaNagesh) January 26, 2023
మరోవైపు విశాఖలోని ఆంధ్ర ప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ నివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో గురు వారం పెద వాల్తేరు శ్రీ పొల మాంబ గుడి వెనుక ఏయూ కొత్త గ్రౌండ్ లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ దినం వసంత పంచమి నాడు శ్రీ జ్ఞాన సరస్వతి మహా యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమం విరాట్ హిందూ సంఘ్, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్, అట్లూరి నారాయణ రావు ఛారిటబుల్ ట్రస్ట్, విశ్వ భారతి ఆధ్వర్యంలో జరిగింది.
ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు వరకు 108 హోమ గుండాలతో ఈ యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసా నంద సరస్వతి మాట్లాడుతూ, అమ్మవారు విద్యార్థులకు ప్రతిభా పాట వాలు, పరీక్షలలో ఉత్తమ ఫలితాలు ప్రసాదిస్తారు అన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను ఈ పవిత్రమైన యజ్ఞం లో భాగస్వామ్యులను చేయడం ఆనందకరం అన్నారు.
ఇదీ చదవండి : తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్.. చిన్నపాటిది ఎగిరినా తెలిసేలా..?
ఈ సందర్భంగా పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసము కూడా చేయించారు. అమ్మవారి ఆశీస్సులతోనే కాళిదాసు, పోతన వంటి కవులు జ్ఞాన వంతులు అయ్యారని తెలిపారు. యజ్ఞం దానం తపస్సు ఆచరించాలి అన్నారు. హిందువులు గా ఉన్నందుకు గర్వించాలి అన్నారు. భారత దేశం పుణ్య భూమి కర్మ భూమి అన్నారు. వచ్చే ఏడాది కోటి దీపోత్సవం నిర్వహించాలని కోరారు. అక్షరాభ్యాసం లో పాల్గొన్న పిల్లలకి సామగ్రి కిట్లు నిర్వాహకులు అందజేశారు. హరినామ సంకీర్తన కూడా విశేషం గా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి : తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. ఒకే రోజు ఏడు వాహన సేవలు.. ప్రత్యేకత ఇదే
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి . ఆయన మాట్లాడుతూ, వసంత పంచమి నాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందం గా వుంది అన్నారు. సరస్వతి దేవిని చూస్తే ఎలా జీవించాలి అర్దం అవుతుందన్నారు. కాలం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకు శరీరం ఉప కరిస్తుంది అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu festivals, Hindu Temples, Visakhapatnam