Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
Crime News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వింత వింత దొంగలు వెలుగులోకి వస్తున్నారు. సాధారణంగా దొంగలు అంటే.. కార్లు.. బైక్ లాంటి వాహనాలు దొంగతనం చేయడమో (Vehicle Theft)..? లేక నగలు, నగదు దోచుకెళ్లడమో.. ఇంకా కాదంటే ఇంట్లో వస్తువులు ఎత్తుకెళ్లే దొంగలు కూడా ఉంటారు.. మరికొందరైతే కోళ్లు, మేకలు లాంటి వాటిని కూడా ఎత్తుకెళ్లే దొంగల గురించి వింటూ ఉంటాం.. కానీ ఈ దొంగలు వేరు.. పెద్ద పెద్ద వాహనాలను కూడా క్షణాల్లో మాయం చేస్తారు.. ముఖ్యంగా వారికి ట్రాక్టర్ (Tractor) రోడ్డుపై కనిపిస్తే అంతే..? ఈజీగా వాటిని అక్కడ నుంచి లేపేస్తారు.. విజయనగరం జిల్లా (Vizianagaram District) లో ఇటీవల తరచూ ట్రాక్టర్లు పోతుండడంతో.. ఏం జరుగుతోందో తెలియక రైతులు పోలీసులను ఆశ్రయించేవారు.. దీంతో పూర్తి ఫోకస్ చేసిన పోలీసులు దొంగలను ఈజీగా పట్టుకున్నారు. వీరు ట్రాక్టర్ దొంగతనాలపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు.. మొన్నటి వరకు కార్మికులుగా ఉన్న వీరు దొంగలుగా ఎందుకు మారారో తెలుసా..?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలో ట్రాక్టర్లు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. వారి దగ్గర నుండి ఒక ట్రాక్టర్ ఇంజన్, మూడు ట్రాక్టర్ ట్రక్కులు, 4.50 లక్షల నగదును రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక వివరాలను వెల్లడించారు.
ఇటీవల విజయనగరం జిల్లాలో ఎస్.కోట, ఎల్.కోట, జామి, డెంకాడ, విజయనగరం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాక్టరు దొంగతనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిసిఎస్, జామి-ఎస్.కోట పోలీసులతో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు. ఈ బృందాలు ఈ తరహా నేరాలకుపాల్పడిన నేరస్థులను రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేసి, అనుమానస్పద వ్యక్తులపై నిఘా పెట్టారన్నారు. జామి మండలంఅలమండ రైల్వే స్టేషను సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న 28 ఏళ్ల శ్రీకాకుళపు నాగరాజు అనేవ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే దొంగతనం మిస్టరీ వీడింది.
పోలీసుల విచారణలో నాగారుజు కీలక విషయాలు చెప్పాడు. తానతో పాటు కొత్తవలస మండలం వియ్యంపేటకు చెందిన 18 ఏళ్ల నాగులాపల్లి గణేష్ , మరో జువినల్ సహకారంతో బృందంగా ఏర్పడి, ఊరికిచివరగా ఉన్న వ్యవసాయ కళ్ళాల్లో ఉన్న పాత ట్రాక్టర్లును దొంగిలించి, వాటి రూపు రేఖలు మార్పులు చేసి, స్క్రాప్ షాపులకు విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నాడు.
ఇదీ చదవండి: నేనేమీ గౌతమ బుద్దుడిని కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్
అయితే నిందితులు ఇటుక బట్టీల్లో పని చేస్తూ, బట్టీ యజమానుల దగ్గర నుండి అడ్వాన్సుగా డబ్బులు తీసుకొని, తిరిగి చెల్లించకపోవడంతో అప్పులబారిన పడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ అప్పుల నుండి బయట పడేందుకు జామి మండలంలో ఒకటి, ఎస్.కోట మండలంలో రెండు, ఎల్. కోట మండలంలో ఒకటి, డెంకాడ మండలంలో ఒకటి, విజయనగరం మండలంలో మరొకటి మొత్తం ఆరు ట్రాక్టర్లును దొంగిలించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
ఇదీ చదవండి : ఏపీ అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ కౌంటర్ ఇదే
ఈ కేసుల్లో నేరస్థుడైన నాగులాపల్లి గణేష్ ను కూడా అరెస్టు చేసి.. వారి దగ్గర నుండి ఒక ట్రాక్టరు ఇంజను, మూడు ట్రాక్టరు తొట్టెలు, ట్రాక్టర్లును స్క్రాప్ షాపులకు విక్రయించిన నగదులో 4.50 లక్షల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు పాల్పడిన నేరాల్లో మరో ట్రాక్టరును (విజయనగరం రూరల్ పిఎస్ కు చెందినది) కడపకు చెందిన బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి నుండి ఇంకనూ రికవరీ చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ నిందితుల అరెస్టుతో ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేసామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram