Home /News /andhra-pradesh /

VIZAGS LG POLYMERS STATEMENT ON COMPANYS SAFE STANDERDS AFTER GAS LEAK BA

Vizag Gas Leak | ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై స్పందించిన ఎల్జీ పాలిమర్స్...

ప్రమాదం జరిగిన ఎల్‌జీ పాలిమర్స్(ఫైల్ ఫోటో)

ప్రమాదం జరిగిన ఎల్‌జీ పాలిమర్స్(ఫైల్ ఫోటో)

‘ఓ గ్లోబల్ కంపెనీగా మా సంస్థలో అంతర్జాతీయ స్థాయి వాతావరణం, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తాం.’ అని ఎల్జీ పాలిమర్స్ ప్రకటించింది.

    దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ స్పందించింది. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై క్లారిటీ ఇచ్చింది. జరిగిన ఘటనపై ఓ ప్రకటన జారీ చేసింది. ‘చనిపోయిన వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఘటనలో బాధితులైన వారికి వైద్య సాయం అందించడం, స్థానిక ప్రభుత్వం, అధికారులతో కలసి పనిచేయడం ప్రస్తుతం మా ప్రథమ కర్తవ్యం. ఒక బాధ్యత కలిగిన గ్లోబల్ సిటిజన్‌గా కంపెనీ ఉద్యోగులు, స్థానికుల ఆరోగ్యం, భద్రత మా ప్రాధాన్యత. ఘటనకు అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు స్థానిక విచారణ సంస్థలకు పూర్తి సహకారం అందించాల్సిందిగా మేం మా సాంకేతిక సిబ్బందిని ఆదేశించాం. ఓ గ్లోబల్ కంపెనీగా మా సంస్థలో అంతర్జాతీయ స్థాయి వాతావరణం, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తాం. ఈ క్రమంలో స్థానిక అధికారులకు పూర్తిగా సహకరిస్తాం.’ అని కంపెనీ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.

    ఎల్జీ పాలిమర్స్ ప్రకటన


    మరోవైపు ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ సంస్థ మీద విశాఖలోని గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీ మీద 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్రంగా విచారించడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఓ కమిటీని నియమించారు. స్పెషల్ సీఎస్, సెక్రటరీ ఇండస్ట్రీస్, సెక్రటరీ పీసీబీ, కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సంయుక్తంగా విచారణ జరుపుతారు. వారి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Vizag gas leak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు