VIZAG STEEL PLANT EMPLOYEES POUR MILK ON PRAJA SHANTHI PARTY CHIEF KA PAUL PHOTO AS HE FIGHTS AGAINST THE PRIVATIZATION OF IN VISAKHAPATNAM STEEL IN HIGH COURT HERE ARE THE DETAILS PRN
KA Paul: కేఏ పాల్ చిత్రపటానికి పాలాభిషేకం.. కారణం ఇదే..
కేఏ పాల్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విశాఖ ఉక్కు (Vizag Steel) ఉద్యమం ఎగసిపడుతోంది. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఉద్యమం ఎగసిపడుతోంది. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా నేతలంతా మద్దతు తెలుపుతున్నారు. ప్రైవేటీకరణను నిలిపేసేవరకు పోరాడతామని స్పష్టం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం నేతలంతా రోడ్డెక్కి పోరాడుతుంటే ఒకరు మాత్రం న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. ఆయననే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. స్వతహాగా ఉత్తరాంధ్రకు చెందిన వారైన కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేఏ పాల్ కు అనుకూలంగా నినాదాలు కూడా చేశారు.
ఐతే విశాఖ ఉక్కుకోసం ఇంతమంది ఉద్యమం చేస్తుంటే.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు సడన్ గా కేఏ పాల్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఆసక్తికరంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చిన వెంటనే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం వల్ల వేలాది మందికి ఉపాధి దూరమవుతుందని.. దీనివల్ల నష్టమే తప్ప లాభముండదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. క్యాపిటివ్ మైనింగ్ అంశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు లీజు అనుమతులు వచ్చేలా చూడాలని కోర్టును కోరారు.
ఈ పిటిషన్ లో కేంద్ర మైనింగ్ శాఖ, కేంద్ర స్టీల్ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చిన ఆయన.. ఆంధ్రుల మనోభావాలను కాపాడాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు విరాళాలు కూడా సేకరిస్తానని స్పష్టం చేశారు. కేఏ పాల్ వేసిన పిటిషన్ తో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ప్రస్తుతం ఆయన హీరో అయ్యారు. అందుకే విశాఖ కూర్మన్న పాలెం జంక్షన్లో పాల్ చిత్రపటానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.