Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున ఆయన్ని బలవంతంగా దీక్షా స్థలి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. పల్లా శ్రీనివాసరావు 6 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు వైద్య సాయం అందాలనే ఉద్దేశంతో దీక్షను భగ్నం చేశారు. ఐతే... ఈ సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. అయినప్పటికీ పోలీసుల ప్రయత్నమే ఫలించింది. అయితే... తాను ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు చెబుతున్నారు.
ఇప్పటికే చాలా మంది శ్రీనివాసరావుకి మద్దతు పలికారు. రోజురోజుకూ ఉక్కు ఉద్యమం బలపడుతోంది. స్థానిక నేతలు ఎవరికి వారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ ప్రకటనలు చేస్తున్నారు. అటు కేంద్రంలో కూడా రాష్ట్ర ఎంపీలు తమ విన్నపాలు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు. దాంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనన్న ఉద్దేశంతో పోలీసులు ముందుగానే పల్లాను దీక్షా స్థలి నుంచి తరలించారు.
ఇది కూడా చదవండి:Gold Prices Today: 3 రోజులుగా స్థిరంగా బంగారం ధరలు... పెరిగిన వెండి
మొత్తానికి శ్రీనివాసరావును తరలించడంతో... ఈ ఉద్యమం మరింత బలపడుతుందనే వాదన వినిపిస్తోంది. తమ కోసం దీక్ష చేస్తున్న వారిని పోలీసులు తరలించారనే ఉద్దేశంతో ప్రజలు రోడ్లపైకి వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకుంటారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు పల్లాకు మద్దతుగా రైతులు విశాఖకు వచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News