వైసీపీకి కేంద్రం అనుకూల నిర్ణయం... ఏపీ ప్రభుత్వం హ్యాపీ

Indian Railways : ఓవైపు అమరావతి నుంచీ రాజధానిని విశాఖకు తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో... విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం కలిసొస్తోంది.

news18-telugu
Updated: January 13, 2020, 7:10 AM IST
వైసీపీకి కేంద్రం అనుకూల నిర్ణయం... ఏపీ ప్రభుత్వం హ్యాపీ
వైసీపీకి కేంద్రం అనుకూల నిర్ణయం... ఏపీ ప్రభుత్వం హ్యాపీ
  • Share this:
విశాఖ రూపురేఖలు మరింతగా మారబోతున్నాయా? అభివృద్ధిలో మరింత దూసుకుపోబోతోందా? అలాంటి సంకేతాలే వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న తరుణంలో కేంద్ర రైల్వే శాఖ తియ్యటి వార్త చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే కార్యాలయాలన్నీ విశాఖ నుంచే పనిచెయ్యాలని ఆదేశించింది. ఇప్పటివరకూ ఇవన్నీ దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద సికింద్రాబాద్ నుంచీ పనిచేస్తున్నాయి. ఇటీవల విశాఖపట్నం దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటైంది. ఈ జోన్ కిందకు వచ్చే రైల్వే కార్యాలయాలన్నీ... ఏప్రిల్ నుంచీ ఇదే జోన్ కింద పనిచేస్తాయి. అప్పుడిక సికింద్రాబాద్ రైల్వే ఈ కార్యకలాపాలతో సంబంధం ఉండదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కేంద్రం రెండుగా విభజించింది. విశాఖపట్నం డివిజన్‌ను దక్షిణ తీర రైల్వే జోన్‌గా మార్చుతూ రైల్వే బోర్డు ఉత్తర్వులిచ్చింది. ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉండబోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు పనిచేస్తాయి. విశాఖలో ఆఫీసులు, మౌలిక వసతుల కోసం కేంద్రం రూ.120 కోట్లు ఇచ్చింది. తాజాగా వెంటనే ఉద్యోగుల్ని సికింద్రాబాద్ నుంచీ వైజాగ్ తరలించాలని సూచించింది. ఎవరైనా ఉద్యోగులు అలా వెళ్లడానికి ఇష్టపడకపోతే... బలవంతంగా కూడా పంపించాలని చెప్పింది. సో... సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన ఉద్యోగులు తిరిగి సికింద్రాబాద్ రాగానే... విశాఖ రైల్వే జోన్‌కి పెట్టే బెడా సర్దుకునే కార్యక్రమం మొదలవుతుందన్నమాట.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 20 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వాళ్లలో 10 వేల మంది విశాఖకు తరలిపోవాల్సిందే. ఈ విషయంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా అభ్యంతరాలు చెప్పడానికి వీల్లేదంటున్నారు. అందరూ తరలిపోవాల్సిందే. పిల్లల విద్యా సంవత్సరం పూర్తయ్యేదాకా ఉండి... అప్పుడు వెళ్తామని అంటే కుదరదు. ఇప్పుడే వెళ్లిపోవాలన్నమాట. విశాఖలో తాత్కాలిక ఆఫీసుల్ని ఎక్కడెక్కడ ఎంపిక చెయ్యాలో డిసైడ్ చేసుకునేందుకు... కొంత మంది సీనియర్ అధికారులు... ఈ నెల 20 తర్వాత సికింద్రాబాద్ నుంచీ వైజాగ్ వెళ్లబోతున్నారు. వాళ్లు డిసైడ్ చేసేందుకు ఓ 10 రోజులైనా పడుతుంది. ఆ తర్వాత మరో నెల రోజులపాటూ... ఇతరత్రా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే... మార్చిలో ఉద్యోగుల తరలింపు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆల్రెడీ విశాఖను పరిపాలనా రాజధానిగా చెయ్యాలనుకుంటున్న వైసీపీకి... కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం అనుకూలంగా మారే అవకాశాలున్నాయి.

First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు