విశాఖ ఫార్మా సిటీ పేలుడులో ఒకరు మృతి... మరొకరికి తీవ్ర గాయాలు...

Vizag Pharma City Blast | ఒక్కసారిగా మంటలు రావడంతో... ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

news18-telugu
Updated: July 14, 2020, 10:22 AM IST
విశాఖ ఫార్మా సిటీ పేలుడులో ఒకరు మృతి... మరొకరికి తీవ్ర గాయాలు...
విశాఖ ఫార్మా సిటీ పేలుడులో ఒకరు మృతి...? మరొకరికి తీవ్ర గాయాలు...
  • Share this:
Vizag Pharma City Blast: విశాఖ రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్‌ కంపెనీలో ట్యాంకర్‌ పేలిన ప్రమాదంలో సీనియర్‌ కెమిస్ట్‌ ఒకరు చనిపోయారు. రాత్రి సీనియర్‌ కెమిస్ట్‌ నాగేశ్వరరావు ‌(40) డ్యూటీకి వెళ్లారు. పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. మంగళవారం ఉదయం శిథిలాల మధ్య ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. దీనిపై కంపెనీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటనా చెయ్యలేదు. పేలుడు ఘటనలోనే నాగేశ్వరరావు చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ (33) గాజువాకలోని ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు. మరో ముగ్గురికి కొద్దికొద్దిగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలం దగ్గర 15 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని అంచనా ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయంటున్నారు అధికారులు. పరిశ్రమ దగ్గర్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని దారుల్నీ పోలీసులు మూసివేశారు. రాంకీ ఫార్మా సంస్థ దగ్గర పోలీసులు భారీగా ఉన్నారు.

ఫార్మాసిటీలో మందులు తయారు చేసేటప్పుడు వృథా ఆయిల్‌ను రీసైక్లింగ్ చేస్తారు. అలా చేస్తున్నప్పుడు... రాత్రి 10కి నైట్ షిఫ్ట్ మొదలైన కాసేపటికే ఇలా జరిగింది. మొన్న రసాయన వాయువులు లీకై ఇద్దరు చనిపోయిన సాయినాథ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీకి దగ్గర్లోనే ఈ సాల్వెంట్ కంపెనీ ఉంది. మొత్తం 17సార్లు పేలుడు శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఆ శబ్దాలు... కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని తెలిసింది.పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీ వ్యర్థాలను సేకరించి శుద్ధి చేస్తుంది. సాల్వెంట్స్‌ను పంపిణీ చేస్తుంది. ఒక రియాక్టర్‌లో సాల్వెంట్స్‌ వేస్తుండగా పేలుడు సంభవించిందని అంటున్నారు. ప్రస్తుతం స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనా స్థలంలో చెడు రసాయనాల వాసనలు ఏవీ లేవని అధికారులు అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading