హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

LG Polymers: ఎల్జీ పాలిమర్స్ విషాధ ఘటనకు రెండేళ్లు.. ఇప్పటికీ అందని పూర్తి సాయం

LG Polymers: ఎల్జీ పాలిమర్స్ విషాధ ఘటనకు రెండేళ్లు.. ఇప్పటికీ అందని పూర్తి సాయం

LG Polymers: విశాఖలో ఆ విషాధ ఘటనకు రెండేళ్లు దాటింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చింది. బారీ నష్ట పరిహారం ప్రకటించింది. కానీ ఆ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా.. తమ కష్టాలు తీరలేదంటున్నారు బాధితులు..

ఇంకా చదవండి ...

  P Anand Mohan, Visakhapatnam, News18.                         LG Polymers:  ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పెను ప్రమాదాల్లో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఒకటి..  వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకై 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషవాయువు ధాటికి ఊపిరి అందక జనాలు రోడ్లపైనే కుప్పకూలిపోయారు. కళ్లెదుటే తమ వారిని బంధువులు కోల్పోయారు. ఈ ఘటన అందరినీ కలచి వేసింది. కళ్లారా చూస్తుండగానే ఊపరి అందకా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అంతా కుప్ప కూలారు. అయితే ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన ప్రభుత్వం భారీగా నష్ట పరిహారం ప్రకటించింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ విషాధం జరిగి  రెండేళ్ళు అవుతున్నా, స్థానికులు, బాధితులలో భయం  వీడలేదు.

  ప్రమాదం జరిగిన తరువాత చాలామంది  వెంకటాపురం, అడవివరం, వేపగుంట, పెందుర్తి, చిన ముషిడివాడ, సుజాతనగర్ ప్రాంత వాసులు ఇళ్లు వదిలి రోడ్లపైకి వచ్చారు. ఇదే సమయంలో విజృంభించిన కోవిడ్‌ ఫస్ట్ వేవ్ మరింత భయభ్రాంతులకు గురి చేసింది. కానీ అప్పుడు పెద్ద మనసు చూపించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మృతుల కుటుంబాలకు  కోటి రూపాయల నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, మిగిలిన బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేని.. బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరికి అందినా, మరి కొందరికి పరిహరం అందలేదని అంటున్నారు. ఈ ప్రమాదానికి గురై ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలతో ఇంకా బాధపడుతున్నామని బాధితులు చెబుతున్నారు. 

  గతంలో పాలిమర్స్‌ ఫ్యాక్టరీ పరిసరాల్లో రెండు వేల ఎకరాల వరకు సాగు అయ్యేది. అయితే ఘటన జరిగిన తర్వాత ఫ్యాక్టరీ రంగు మారిన నీళ్ళు పంట భూముల్లోకి పారడంతో పంటలు సరిగ్గా పండటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ పండినా పంటలో నాణ్యత ఉండటం లేదంటున్నారు. ఈ రంగు మారిన నీళ్లు పశువులు సైతం తాగి మృత్యువాత పడుతున్నాయంటున్నారు.

  319 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించిన నీరబ్‌ కుమార్‌ కమిటీ నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించాలి లేదా గ్రీన్ కేటగిరీ పరిశ్రమలుగా మార్చాలి అంటూ నివేదిక సమర్పించింది. ఏది ఏమైనా కంపెనీని వెంకటాపురం నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

  ప్రమాదం జరిగి రెండేళ్ళు అవుతున్నా వెంటాపురం గ్రామస్థులను ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది. వెంకటాపురంతో పాటు నందమూరి నగర్‌, వెంకటాద్రి గార్డెన్స్‌, జనతా కాలనీ, పద్మనాభ నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీ, కంపరపాలెం కాలనీ ప్రజలు ప్రమాదాన్ని గుర్తు చేసుకుని భయాందోళనకు గురవుతున్నారు. విషవాయువు లీకై గ్రామానికి చెందిన 12 మంది ప్రమాదం జరిగిన రోజున మృతిచెందగా, మరో ముగ్గురు మరికొన్ని రోజుల తర్వాత మృతి చెందారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam

  ఉత్తమ కథలు