ఎల్జీ పాలిమర్స్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. అక్కడికే వెళ్లండి..

ప్రతీకాత్మక చిత్రం

స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు తక్షణం డిపాజిట్ చేయాలన్న తీర్పుపై ఈ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఏపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించిది ఎల్జీ పాలిమర్స్.

  • Share this:
    ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్జీటీలో విచారణ తర్వాతే సుప్రీంకోర్టులు విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జీటీకి లేదని ఎల్జీ పాలిమర్స్ వాదనలు వినిపించగా.. ఆ వాదనలన్నీ NGT ఎదుటే ప్రస్తావించాలని తెలిపింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎల్టీ పాలిమర్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో రూ.50 కోట్లు తక్షణం డిపాజిట్ చేయాలన్న తీర్పుపై ఈ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఏపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించిది ఎల్జీ పాలిమర్స్. ఐతే NGT విచారణ పూర్తైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.

    మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు
    Published by:Shiva Kumar Addula
    First published: