ఎలా జరిగింది.. Vizag Gas Leak ఘటనపై సీఎం జగన్ ఆరా

Vizag Gas Leak Updates | ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

news18-telugu
Updated: June 30, 2020, 9:07 AM IST
ఎలా జరిగింది.. Vizag Gas Leak ఘటనపై సీఎం జగన్ ఆరా
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
Vizag Gas Leak Incident: విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మ«ధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లాకలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు.

ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. బాధితులను కలెక్టర్‌ వినయ్, విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మీనా పరామర్శించారని తెలిపారు. ఈఘటనపై విచారణ కూడాచేయిస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ కెమికల్స్‌లో రియాక్టర్ నుంచి విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, గౌరీశంకర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధిక మోతాదులో రియాక్టర్ వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
First published: June 30, 2020, 8:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading