విశాఖ ఎల్జీ పాలిమర్స్‌కు మరోసారి షాకిచ్చిన సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

కేసుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా హైకోర్టే పూర్తి స్థాయిలో విచారణ చేపడతాయని స్పష్టం చేసింది. అక్కడ విచారణ ముగిసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలని ఎల్టీ పాలిమర్స్‌కు సూచించింది.

  • Share this:
    విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సుప్రీంకోర్టు మరో షాక్ తగిలింది. ప్లాంట్‌ను మూసివేయాలన్న ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కంపెనీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది... ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా పరిశ్రమలోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. విచారణ కోసం నియమించిన 7 కమిటీల్లో దేని ముందు హాజరు కావాలో అర్థం కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఐతే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా హైకోర్టే పూర్తి స్థాయిలో విచారణ చేపడతాయని స్పష్టం చేసింది. అక్కడ విచారణ ముగిసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలని ఎల్టీ పాలిమర్స్‌కు సూచించింది. జూన్ 1న ఎల్టీ పాలిమర్స్‌పై NGTలో విచారణ జరగనుంది.

    మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు
    Published by:Shiva Kumar Addula
    First published: