విశాఖ గ్యాస్ లీక్.. 13కు చేరిన మృతులు..

ప్రతీకాత్మక చిత్రం

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన విశాఖ వాసులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా, తాజాగా మరో మహిళ చనిపోయింది.

  • Share this:
    ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన విశాఖ వాసులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా, తాజాగా మరో మహిళ చనిపోయింది. దీంతో మొత్తం 13 మంది గ్యాస్ లీక్ వల్ల మృతిచెందారు. వెంకాయమ్మ అనే మహిళ గ్యాస్ లీక్ సందర్భంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. అప్పుడు కోలుకొని డిశ్చార్జి అయ్యింది. అయితే, ఈ నెల 19న మరో సారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, ఈ రోజు పరిస్థితి విషమించి మృతి చెందింది. కాగా, ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను సీజ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు ఆ పరిశ్రమను నిన్న సీజ్ చేశారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: