విశాఖ గ్యాస్ లీక్.. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ సీజ్..

ప్రతీకాత్మక చిత్రం

విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు పరిశ్రమకు సీల్ వేశారు.

  • Share this:
    విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు పరిశ్రమకు సీల్ వేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా తీసుకుని విచారించిన హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కర్మాగారం మూసివేయాలని నిర్ధేశించింది. విచారణ కోసం నియమించిన బృందాలు తప్ప ఇతరులు ఎవరు ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. స్థిర,చర ఆస్తులను తమ ఆదేశం లేకుండా తరలించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు అందడంతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన పరిశ్రమను సీజ్ చేసేసింది. వాస్తవానికి.. గ్యాస్ లీక్‌కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 14 వేల టన్నుల స్టైరిన్ నిల్వలను తరలించుకుపోవాలని ఆదేశించింది.

    అయితే, స్టైరిన్ తరలింపు వ్యవహారంపై ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. పరిశ్రమ యాజమాన్యంకు నష్టం కలుగకుండా ప్రభుత్వం స్టైరిన్ తరలించి మేలు చేసిందని.. ఇప్పుడు జనం కోసం నిర్ణయం తీసుకున్నామని చెబుతూ పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నేరం రుజువైతే రూ. 300కోట్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని అంటోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: