ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కే జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్‌ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావు, కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కే జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్‌ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావు, కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 278, 284, 285, 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సోమవారం సీఎం వైఎస్ జగన్‌కు తుది నివేదికను సమర్పించింది. విశాఖ గ్యాస్ లీకేజీకి సంబంధించి అనేక కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4,000 పేజీల నివేదిక సీఎంకు అందజేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను కమిటీ వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని స్పష్టం చేసింది. ఈ దుర్ఘటనకు పూర్తిగా మనవ తప్పిదమే కారణమి తెలిపింది.
మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. మరో 585 అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి.
గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం హై పవర్ కమిటీని నియమించగా.. సోమవారమే ఆ కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.