హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lucky Fisherman: ఆశగా చేపల కోసం వల వేశారు.. కానీ ఇవి చిక్కాయి.. వీటి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Lucky Fisherman: ఆశగా చేపల కోసం వల వేశారు.. కానీ ఇవి చిక్కాయి.. వీటి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

మత్స్యకారుల పంట పండించాయి

మత్స్యకారుల పంట పండించాయి

Lucky Fisherman: మత్స్యకారులకు వివిధ రకాల చేపలు దొరుకుతుంటాయి.. అందులో కొన్ని భయంకరమైనవి ఉంటే.. మరికొన్ని వింత వింతగా ఉంటాయి. అయితే ఈ సారి వలకు చిక్కినవి మాత్రం మత్స్యకారుల పంట పండించాయి.. వీటి స్పెషల్ ఏంటో తెలుసా..?

Lucky Fisherman: చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి.. కొన్ని అత్యంత బరువు ఉన్నవైతే.. మరికొన్ని అత్యంత పొడుగ్గా ఉంటాయి.. మరికొన్ని యమ రుచీగా ఉంటాయి.. మరికొన్ని భయపెట్టేవి ఉంటాయి. ఇలా చేపల్లో ఎన్నో రకాలు చూస్తూ ఉంటాం. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు అప్పుడప్పుడు వింత చేపలు (Rare fish)దొరుకుతాయి వాటిని చూసి.. ఇవాళ తమ పంట పండింది అనుకుంటారు. ఎందుకంటే.. సాంప్రదాయ మత్స్యకారులు రోజంతా కష్టపడితే.. వారికి దక్కే ఫలితం అంతంత మాత్రమే. నడిసంద్రంలో ప్రాణాలకొడ్డి వేట సాగించే మత్స్యకారులకు కొన్ని సందర్భాల్లో కష్టమే మిగులుతుంది. అలాంటి వారికి అరుదైన మత్స్య సంపద దొరికితే ఆ ఆనందమే వేరు. అప్పటివరకు పడ్డ కష్టమంతా మర్చిపోతారు. తాజాగా అలాంటి అద్భుతమే విశాఖలో జరిగింది. అధిక సంఖ్యలో చేపలు వలకు చిక్కితే.. మంచి ధర వస్తాయని.. కొన్ని రోజులు హ్యాపీగా గడొప్పొచ్చని ఆశించి.. చేపల కోసం వల వేశారు.

విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ పరిమాణంతో.. ఆకర్షించే రంగుతో ఉండే రొయ్యలు చిక్కాయి. సాంప్రదాయ మత్స్యకారులకు అరుదుగా దొరికే ఈ రొయ్యలతో ఆ మత్స్యకారులకు అదృష్టం కలిసి వచ్చినట్లయింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం(Atchutapuram Mandal) పూడిమడక(Pudimadaka)లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ కాయంతో ఉన్న లాబ్ స్టర్ రొయ్యలు చిక్కాయి. సాధారణంగా రాళ్ల మధ్య నివసించే ఈ రొయ్యలు మత్స్యకారులకు చిక్కడం అరుదు. అది కూడా సాంప్రదాయ మత్స్యకారులకు చిక్కడం అంటే అసలు సాధ్యమేకాదు అంటున్నారు. అదృష్టం కలిసొచ్చి మత్స్యకారులకు పలకరించాయి ఈ రొయ్యలు.

నిత్యం మత్స్యకారులకు రొయ్యలు దొరుకుతూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం.. సాధారణ రొయ్యలతో పోలిస్తే పొడవాటి మీసాలు, భారీ కాయం ఉంటుంది వీటికి. ఈ లాబ్ స్టర్ రొయ్యలను కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ గా పిలుస్తుంటారు. సాధారణ రొయ్యలతో పోలిస్తే వీటి ధర భారీగా ఉంటాయి. కిలో 1500 రూపాయల వరకు పలుకుతుంది అంటున్నారు. అయితే సాధారణ ఫ్రాన్స్ తో పొలిస్తే.. వీటి బరువు కూడా కిలోన్నర నుంచి మూడు కిలోల వరకు ఉంటుంది. అమెరికా, జపాన్, చైనా లాంటి దేశస్తులు ఈ లాబ్ స్టార్ రొయ్యలను చాలా ఇష్టంగా తింటారు అంట. అందుకే ఆయా దేశాల్లో వీటికి ఊహించని డిమాండ్ కనిపిస్తుంది. మన సముద్రంలో దొరికే ఈ రొయ్యలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కెనడాలో అత్యధికంగా లభించే ఈ లాబ్ స్టర్ రొయ్యలు.. మన దగ్గర అరుదుగా చిక్కుతుంటాయి. తాజాగా విలువైన ఈ రొయ్యలు చిక్కడంతో పూడిమడక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

First published:

ఉత్తమ కథలు