సముద్రంలో తగులబడిన నౌక...విశాఖ తీరంలోభారీ అగ్నిప్రమాదం

ప్రమాద సమయంలో నౌకలో 29 మంది సిబ్బంది ఉండగా వారిలో 28 మందిని కోస్ట్ గార్డ్ రక్షించింది. ఒకరు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు.

news18-telugu
Updated: August 12, 2019, 5:28 PM IST
సముద్రంలో తగులబడిన నౌక...విశాఖ తీరంలోభారీ అగ్నిప్రమాదం
తగలబడుతున్న కోస్టల్ జాగ్వర్ నౌక
news18-telugu
Updated: August 12, 2019, 5:28 PM IST
విశాఖ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నడి సంద్రంలో కోస్టల్ జాగ్వార్ నౌకలో మంటలు చెలరేగాయి.   పెద్ద ఎత్తున మంటలు ఎగసిడడంతో దట్టమైన  పొగలు అలుముున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకేశారు.  సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది బోట్లతో చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  స్పెషల్ బోట్ల సాయంతో మంటలను అదుపుచేశారు.   సముద్రంలో దూకిన నౌక సిబ్బందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాద సమయంలో నౌకలో  29 మంది సిబ్బంది ఉండగా వారిలో 28 మందిని కోస్ట్ గార్డ్ రక్షించింది. ఒకరు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. అతడి కోసం బంగాళాఖాతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఐతే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.




First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...