హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: వివేకా హత్య కేసు..ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

Big News: వివేకా హత్య కేసు..ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్!

ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్!

వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 28న సీబీఐ విచారణకు హాజరవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈనెల 23న మొదటిసారి అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్లో జనవరి 24న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే ఈ నోటిసులపై అవినాష్ రెడ్డి స్పందించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 28న సీబీఐ విచారణకు హాజరవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈనెల 23న మొదటిసారి అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్లో జనవరి 24న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే ఈ నోటిసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. నోటీసులు ఇచ్చి ఒక్క రోజులో రావాలంటే ఎలా? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి తెలిపాడు. 4 రోజుల పాటు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని, మరోసారి సీబీఐ నోటీసులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అని అన్నాడు. ఇక ఎంపీ అవినాష్ విజ్ఞప్తి మేరకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈనెల 28న విచారణకు రావాలని కాస్త సమయం కూడా అధికారులు ఇచ్చారు. మరి ఈసారైనా అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

Visakhapatnam: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్ బోగీలు మిస్సింగ్.. అంతదూరం వెళ్లేదెట్లా..?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇటీవల విచారణ జరిపింది. కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. న్యాయం జరగాలనుకోవడం బాధితురాలి యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.

3 ఏళ్లుగా దర్యాప్తు..

వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. మరి రానున్న రోజుల్లో సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి.

First published:

Tags: Andhrapradesh, Ap, Ycp, Ys viveka murder case

ఉత్తమ కథలు