Home /News /andhra-pradesh /

VISKHAPATNAM NEWS SIMHACHALAM DEVASTHAM WILL TRYING TO STARAT E BUSSE FOR TEMPLE NGS VSP

E Buses: సింహాచలం కొండపై ఇక ఈ బస్సులు.. ఎప్పటి నుంచి అంటే..?

సింహాచలం దేవస్థానం

సింహాచలం దేవస్థానం

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న భక్తులకు గుడ్ న్యూస్ చెబుతోంది దేవస్థానం.. త్వరలోనే ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీటి ని కొనేందుకు ఖర్చు ఎంత..? నిర్వహణ కోసం ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది..

    P Anand Mohan, Visakhapatnam, News18.                      Varaha Lakshmi Narasimha  Temple Simhachalam: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న భక్తులకు గుడ్ న్యూస్.   కేవలం ఉత్తరాంధ్ర ప్రజలే కాదు.. యావత్ భారత దేశం నుంచి భారీగా వరాహ లక్ష్మి స్వామిని దర్శించుకోడానికి నిత్యం వస్తూ ఉంటారు. అప్పన్న సన్నిధిలో కోరుకున్నది ఏదైనా జరుగుతుందన్నది భక్తుల నమ్మకం..  అందుకే వేల కిలోమీటర్ల దూరం ఉన్నా భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. పెరుగుతున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేసేందుకు సింహాచలం (simhachalam) దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా  ఇకపై  కొండపైకి ఎలక్ర్టిక్‌ (ఈ) బస్సులు నడపాలని  యోచిస్తోంది. అప్పన్న సన్నిధిలో కాలుష్యం తగ్గించడానికి డీజిల్‌ బస్సులు స్థానే కాలుష్య రహితమైన ఈ-బస్సులు వేస్తే ఎలా ఉంటుందో, ఎంత వ్యయం అవుతుందో అంచనాలు రూపొందించాలని దేవస్థానం చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathi Raju) సూచించారు. ఈ మేరకు ఈఓ సూర్యకళ గత ఐదేళ్లలో డీజిల్‌ కోసం వెచ్చించిన వ్యయం, బస్సుల నిర్వహణ ఖర్చులు తదితరాలన్నింటినీ బయటకు తీశారు. అలాగే దేవస్థానం సొంతంగా నిర్వహిస్తున్న ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంటు  (Solar Plant) ద్వారా ఎంత విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది? అందులో ఎంత వినియోగించి, ఎంత గ్రిడ్‌కు ఇస్తున్నదీ ఆమె పొందుపరిచారు.  వీటన్నింటినీ రాబోయే  బోర్డు సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

    ప్రస్తుతం సింహాచలం దేవస్థానానికి ఐదు బస్సులు ఉన్నాయి. అందులో ఒకటి మూలకు చేరింది. నాలుగు మాత్రమే తిరుగుతున్నాయి. సగటున ఒక్కో బస్సు నెలకు ఆరు వేల కి.మీ. దూరం తిరుగుతోంది. ఒక్కో బస్సుకు నెలకు సగటున 1,500 లీటర్ల డీజిల్‌ అవుతోంది. గత ఐదేళ్లలో నాలుగు బస్సులు తిరిగిన దూరం, వాటికి వినియోగించిన డీజిల్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్కటి లీటరు డీజిల్‌కు 3.7 కి.మీ. దూరం ప్రయాణిస్తున్నాయి. ఇవి పూర్తిగా కొండ కింద నుంచి కొండ మీదకు మాత్రమే తిరగడం, ఆ మార్గం అంతా ఘాట్‌ రోడ్‌ కావడంతో మైలేజీ ఎక్కువగా రావడం లేదు.

    ఇదీ చదవండి : ఫోన్ లో ముచ్చట్లు వద్దని వారించిన తల్లిదండ్రులు.. ఆ కూతురు ఏం చేసిందంటే..?

    దేవస్థానం చైర్మన్‌ ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వ పథకం ఫేమ్‌-2 కింద ఎలక్ర్టిక్‌ బస్సులను సమకూర్చుకోవడానికి అందుబాటులో వున్న అన్ని మార్గాలను అధికారులు అన్వేషించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇదే ఆలోచనతో 50 ఈ-బస్సులు తిప్పడానికి యోచిస్తోంది. తొమ్మిది మీటర్ల పొడవు, డ్రైవర్‌తో కలిసి 36 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ-బస్సు ఖరీదు 1.5 కోట్లు రూపాలుగా  ఉంది. అదే ఏడు మీటర్ల పొడవు, 25 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సు అయితే  1.45 కోట్లు. వీటికి చార్జర్‌ కోసం  5 లక్షల రూపాయలు అదనంగా చెల్లించాలి. నిర్వహణ వ్యయం అదనం. పీటీడీగా మారిన ఆర్‌టీసీ కూడా ఈ-బస్సుల కోసం ప్రయత్నిస్తోంది.  ఘాట్‌రోడ్డుల్లో ఈ-బస్సు తిప్పడానికి కిలోమీటర్‌కు 45.76 అవుతుందని, నెలకు కనీసం 91  వేల కిలోమీటర్లు  తిప్పాల్సి వుంటుంది అని అంచనా..

    ఇదీ చదవండి : వెలుగులోకి వైసీపీ నాయకురాలి హనీ ట్రాప్ వ్యవహారం.. కాల్పుల ఘటనలో సంచలన విషయాలు

     ఈ-బస్సులు కొనుగోలు చేయాలంటే.. ముందుగా  నాలుగు బస్సులకు కలిపి 6 కోట్ల రూపాయలు వెచ్చించాలి. నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుందని పీటీడీ వర్గాలు చెబుతున్నాయి. కాలుష్యం లేకుండా ఉండాలన్నా, వ్యయం తగ్గించుకోవాలన్నా కొండపైకి రోప్‌వే కూడా ఒక ప్రత్యామ్నాయంగా వుంటుందని పలువురు సూచిస్తున్నారు. కైలాసగిరిపైకి వీఎంఆర్‌డీఏ రోప్‌వే నిర్వహిస్తోంది. అప్పన్న కొండపైకి కూడా అలా వేస్తే ఎలా వుంటుందో ఆలోచించాలని పలువురు అధికారులు సూచిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Electric Vehicles, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు