పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య.. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లాక..

ప్రతీకాత్మక చిత్రం

కేజీహెచ్‌లో చికిత్స పొందిన పాల వెంకాయమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికెళ్లిన రెండు రోజుల్లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 19న మళ్లీ కేజీహెచ్‌కు తరలించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. ప్రమాదం జరిగిన తర్వాత కేజీహెచ్‌లో చికిత్స పొందిన పాల వెంకాయమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికెళ్లిన రెండు రోజుల్లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 19న మళ్లీ కేజీహెచ్‌కు తరలించారు. అప్పట్నుంచి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ తాజాగా తుది శ్వాస విడిచింది. ఇదిలావుంటే.. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాదంలో స్టైరిన్ వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగక ముందు మంచి ఆరోగ్యంతో ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం కారణంగా ఇప్పటికే 12 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా వెంకాయమ్మ మృతిచెందడంతో ప్రమాద మరణాల సంఖ్య 13కు చేరింది.
    Published by:Narsimha Badhini
    First published: