VISHAKA GAS LEAK SITUATION UNDER CONTROL CITY POLICE COMMISSIONER RK MEENA MK
గ్యాస్ లీకేజీపై వదంతులు నమ్మవద్దు..విశాఖ పోలీస్ కమినర్ ఆర్కే మీనా...
ప్రమాదం జరిగిన ఎల్జీ పాలిమర్స్(ఫైల్ ఫోటో)
విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని, చుట్టుప్రక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు ప్రజలు తప్పించి మిగతా ప్రాంతాలలో నివాసముంటున్న వారు ఎక్కడికీ వెళ్లనవసరం లేదని తెలిపారు.
విశాఖ జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున స్టైరిన్ గ్యాస్ లీకేజీ విషయంలో వదంతులు నమ్మవద్దని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కేమీనా తెలిపారు. భారీ విపత్తు సంభవించిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు 9 మంది నిపుణులతో కూడిన బృందం అర్థరాత్రి తరువాత విశాఖకు చేరుకుంది. కాగా గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు 9మంది నిపుణుల బృందం ప్రయత్నిస్తుంది. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని, చుట్టుప్రక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు ప్రజలు తప్పించి మిగతా ప్రాంతాలలో నివాసముంటున్న వారు ఎక్కడికీ వెళ్లనవసరం లేదు . ప్రజలందరూ ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండవచ్చని తెలిపారు. అంతే కాదు గ్యాస్ లీకైన ఘటనపై ప్రజలు భయపడొద్దని విశాఖ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా భరోసా ఇచ్చారు. కెమికల్ ఫ్యాక్టరీకి రెండు కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేయాలని కోరామని మీనా చెప్పారు. కెమికల్ కర్మాగారానికి రెండు కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న ప్రజలు భయపడాల్సిన పనిలేదని, వారు రోడ్లపైకి రావద్దని సీపీ కోరారు. కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.