హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vizag : స్లిమ్ అవ్వాలనుకుంటున్నారా..? ఒక్కసారి ఈ ఫిట్‌నెస్‌ మంత్ర ట్రై చేయండి..!

Vizag : స్లిమ్ అవ్వాలనుకుంటున్నారా..? ఒక్కసారి ఈ ఫిట్‌నెస్‌ మంత్ర ట్రై చేయండి..!

X
Slim

Slim Secret - Vizag Trend

స్లిమ్‌ అవ్వాలన్నా…ఒంట్లో కొవ్వు తగ్గాలన్నా.. ఒళ్లు హునమయ్యేలా ఎక్సర్‌సైజ్‌లు చేయక్కర్లేదు. డైటింగ్‌ల పేరుతో నోటిని కట్టేసుకోనక్కర్లేదు. ఎంజాయ్ చేస్తూ సన్నబడే ఛాన్స్‌ ఒకటుంది. అదేనండి జుంబా డాన్స్‌. వైజాగ్‌లోనూ జుంబా సెంటర్స్ అందుబాటులోఉన్నాయి.

ఇంకా చదవండి ...

స్లిమ్‌ అవ్వాలన్నా…ఒంట్లో కొవ్వు తగ్గాలన్నా.. ఒళ్లు హూనమయ్యేలా ఎక్సర్‌సైజ్‌లు చేయక్కర్లేదు. డైటింగ్‌ల పేరుతో నోటిని కట్టేసుకోనక్కర్లేదు. ఎంజాయ్ చేస్తూ సన్నబడే ఛాన్స్‌ ఒకటుంది. అదేనండి జుంబా డాన్స్‌. ఒకప్పుడు ఇది ఆఫ్రికన్‌ డాన్స్. కానీ ఇప్పుడు మన దేశంలో మెట్రో పాలిటన్‌ సిటీల్లోనే కాదు ప్రధాన నగరాల్లోనూ ట్రెండ్‌ అవుతోంది.

నేటి యువతరం అందంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఫిట్‌నెస్‌ను పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ జుంబా డాన్స్‌ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో.. ఏ టైంకి తింటున్నామో కూడా తెలియట్లేదు. దాని వల్ల కొన్ని ఆరోగ్యసమస్యలు ముఖ్యంగా ఊబకాయం. 14, 17 ఏళ్ల పిల్లలు కూడా బానెడు పొట్టలేసుకుని ఉంటున్నారు. ముఖ్యంగా గృహిణిలు ఇంట్లో వాళ్లందరిని సవరించే సరికి.. తినడం కూడా మర్చిపోతుంటారు. అనారోగ్యసమస్యలు తెచ్చుకుంటారు. అలాంటి వారి కోసం జుంబా డాన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ జుంబా డాన్స్‌ ఫిట్‌నెస్‌ మంత్రా విశాఖకు కూడా పాకింది. విశాఖపట్నంకు చెందిన వరుణ్‌ గ్రూప్‌ ఈ జుంబా డ్యాన్స్‌ను విశాఖ వాసులకు అందుబాటులోకి తీసుకొచ్చామని సీఈఓ శ్రీనివాస్‌ తెలిపారు.

ఫన్‌తో పాటు క్యాలరీస్‌ బర్న్‌ చేయోచ్చు..!

బరువు తగ్గించుకోడానికి మహిళలు, పురుషులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ జుంబా డ్యాన్స్‌తో కష్టపడినట్లు తెలియకుండానే శరీరంలోని క్యాలరీస్‌ బర్న్‌ అవుతాయి. అయితే ఈ జుంబా డాన్స్‌కు ప్రత్యేక ట్రైనర్‌ తప్పనిసరి. ఒకరకంగా చెప్పాలంటే ఈ జుంబా డ్యాన్స్‌… ఏరొబిక్స్‌ను పోలి ఉంటుంది. ఒంట్లో కొవ్వును తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో కరిగించేందుకు జుంబా డాన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రైనర్‌ షకీలా తెలిపారు.

ఉద్యోగులు, యువతులు, గృహిణులు ఖాళీ సమయాల్లో ఆహ్లాదకరమైన సంగీతం వింటూ ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకునేందుకు ఈ జుంబా సెంటర్‌కు వస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా వెళ్తుంటారు. ఈ జుంబా డాన్స్‌ వల్ల బరువు తగ్గడమే కాదు…శరీరంలోని ప్రతి పార్ట్‌ కదలడం వల్ల రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. దాని వల్ల ఆరోగ్యమే కాదు ఫేస్ లో గ్లో కూడా పెరుగుతుంది.

ప్రతి రోజు మూడు సెషన్స్‌..!

గత కొన్నేళ్లుగా ఒకేరకమైన ఎక్సర్‌సైజ్‌లు, జిమ్‌ చేసి బోర్ కొట్టిన వాళ్లందరు ఇప్పుడు జుంబా డాన్స్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే వరుణ్‌ గ్రూప్‌ ఈ జుంబా డాన్స్‌ సెషన్స్‌ను ఇటీవల వైజాగ్‌లో ప్రారంభించారు. ప్రతిరోజు మూడు బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తారు. ఉదయం 9 -10 వరకు తొలి బ్యాచ్‌, సాయంత్రం 5 – 6 వరకు రెండో బ్యాచ్, 7.30- 8.30 గంటల వరకు మూడో బ్యాచ్‌కు శిక్షణ ఇస్తున్నామని సీఈవో శ్రీనివాస్‌ తెలిపారు.

జుంబా డాన్స్‌ వల్ల ఉపయోగాలెన్నో…!

మిగతా ఎక్సర్‌సైజ్‌ల కన్నా జుంబా ద్వారా ఎక్కువ కేలరీలను బర్న్‌ చేయోచ్చు. చెప్పాలంటే ఒక గంటలో 300 నుంచి 400 క్యాలరీలను కరిగించుకోవచ్చని ట్రైనర్‌ తెలిపారు. అయితే ఇది సాధారణ ఎక్సర్‌సైజ్ లకు కాస్త భిన్నంగా ఉంటుంది. పాట బీట్‌కు తగ్గట్లుగా బాడీ అంతా డాన్స్ చేయడం వల్ల యాక్టీవ్‌గా ఉంటారు. ఎగరడం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు వేగవంతం అవుతుంది. కండరాలు ధృడంగా తయారవుతాయి. శ్వాససంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ప్రతిరోజు రెగ్యులర్‌గా ఈ డ్యాన్స్‌ చేస్తే..నిత్య యవ్వనంగా ఉండొచ్చంటున్నారు ట్రైనర్లు.

ఫీజు వివరాలు

S.Noసమయంఫీజుజీఎస్టీమొత్తం
1ఒక రోజు400/-72/-472/-
2ఒక వారం1500/-270/-1770/-
315 రోజులు2000/-360/-2360/-
4ఒక నెల3000/-540/-3540/-
5మూడు నెలలు7000/-1260/-8260/-
6ఆరు నెలలు13,000/-2340/-15,340/-
7ఏడాది18,000/-3240/-21,240/-


పర్సనల్‌ ట్రైనింగ్‌ (Personal Training)

S.NOసమయంసెషన్స్‌ఫీజుజీఎస్టీమొత్తం
1ఒక నెల136,500/-1170/-7,670/-
2మూడు నెలలు3918,000/-3240/-21,240/-
3ఆరు నెలలు7233,000/-5940/-38940/-
4ఏడాది14460,000/-10,800/-70,800/-


ప్రీమియం పర్సనల్‌ ట్రైనింగ్‌ (Premium Personal Training)

S.NOసమయంసెషన్స్‌ఫీజుజీఎస్టీమొత్తం
1ఒక నెల138,500/-1530/-10,030/-
2మూడు నెలలు3923,400/-4212/-27,612/-
3ఆరు నెలలు7243,800/-7884/-51,684/-
4ఏడాది14484,000/-15,120/-99,120/-


కొంబొ ఆఫర్స్‌ (Combo Offers)

S.Noసమయంఫీజుజీఎస్టీమొత్తం
1ఏడాది మెంబర్‌షిప్‌+ 3 నెలల పర్సనల్‌ ట్రైనింగ్‌35,000/-5670/-37,170/-
2ఏడాది మెంబర్‌షిప్‌+ 6 నెలల పర్సనల్‌ ట్రైనింగ్‌45,000/-8100/-53,100/-
3ఏడాది మెంబర్‌షిప్‌+ ఏడాది పర్సనల్‌ ట్రైనింగ్‌69,000/-12,420/-81,420/-


న్యూట్రిషన్‌ ప్యాకేజీ(Nutrition Package)

S.Noప్యాకేజీఫీజుజీఎస్టీమొత్తం
1కౌన్సిలింగ్ అండ్ డైట్‌ ప్లాన్‌(నెల)30005403540/-


ఇక్కడ జుంబా డాన్స్‌ మాత్రమే కాదు జిమ్‌, పర్సనల్‌ ట్రైనింగ్‌, న్యూట్రిషన్‌, మసాజ్‌, స్టీమ్‌ బాత్‌ సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీరు ఎంజాయ్‌ చేస్తూ బరువు తగ్గాలనుకుంటున్నారా…అయితే ఒక్కసారి ఈ వరుణ్‌ ఫిట్‌నెస్‌సెంటర్‌కు వెళ్లిరండి..

టైమింగ్స్‌ : ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫిట్‌ నెస్‌ సెంటర్‌ తెరిచే ఉంటుంది. ఒక్క ఆదివారం మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యామ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అడ్రస్‌: వరుణ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, వరుణ్‌ మారుతి బిల్డింగ్‌, సిరిపురం, వైజాగ్‌, ఆంధ్రప్రదేశ్‌- 530003

ఫోన్‌ నెంబర్‌: +91 7901044977, 6281091515

జీమెయిల్‌ : varunfitnessofficial@gmail.com

ఎలా వెళ్లాలి?

ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి సిరిపురం జంక్షన్‌కు ఆటో, బస్సు సదుపాయం ఉంటుంది. బస్సు అయితే 14 నెంబర్‌ ఎక్కితే సరిపోతుంది. ఆకాశవాణి రేడియో స్టేషన్‌ ఎదురుగా వరుణ్‌ మారుతి బిల్డింగ్‌ కనిపిస్తుంది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vizag

ఉత్తమ కథలు